NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Manchu Mohan Babu: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీకి రామ్ రామ్ చెప్పేసినట్లే(గా)..! ఈ వ్యాఖ్యల్లో అంతరార్ధం అదేగా..?

Manchu Mohan Babu: గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పార్టీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేసిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యుడుగా చేసిన మోహన్ బాబు.. సీఎం వైఎస్ జగన్ కు సమీప బంధువు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏదైనా నామినేటెడ్ పోస్టు దక్కుతుందని అందరూ భావించారు. టీటీడీ చైర్మన్, రాజ్యసభ, ఫిలిమ్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఇలా ఏదో ఒక నామినేటెడ్ పదవి మోహన్ బాబుకు లభిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను మోహన్ బాబు కొట్టిపారేశారు. ‘నేను ఏ పదవి ఆశించలేదు, సీఎం జగన్ ఇస్తాననీ చెప్పలేదు’ అని గతంలోనే పేర్కొన్నారు మోహన్ బాబు.

Manchu Mohan Babu sensational comments
Manchu Mohan Babu sensational comments

Manchu Mohan Babu: అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి దూరంగా

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబు ఏనాడూ సీఎం వైఎస్ జగన్ ను కలుసుకోలేదు. ఆయన కుమారుడు మంచు విష్ణు మాత్రం రెండు మూడు సార్లు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి కలిశారు. వైసీపీకి దూరంగా ఉండటంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు కుమారుడు, కుమార్తెతో కలిసి మోహన్ బాబు ఢిల్లీకి వెళ్లి ఆయనకు కలిసి రావడంతో బీజేపీలో చేరతారేమో అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే మోహన్ బాబు అధికారికంగా కాషాయం కండువా కప్పుకోలేదు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సీఎం జగన్ పరిపాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. సీఎం జగన్ ను కొందరు అధికారులు తప్పుదోవపట్టిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మోహన్ బాబు తాను ఏ పార్టీ వ్యక్తిని అనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు.

 

‘నేను బీజేపీ మనిషి’ని

2019 లో తిరుపతిలో తన శ్రీవిద్యానికేతన్ సంస్థ విద్యార్ధులతో కలిసి ధర్నా నిర్వహించిన సందర్భంలో నమోదు అయిన కేసులో కోర్టు విచారణ కోసం మోహన్ బాబు మంగళవారం తిరుపతికి వచ్చారు. ఆనాడు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే అభియోగాలతో కేసు నమోదు అయ్యింది. మోహన్ బాబు, కుమారులు విష్ణు, మనోజ్ లతో పాటు శ్రీవిద్యానికేతన్ ఏఓ తులసినాయుడు, పీఆర్ఓ సతీష్ లపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నిమిత్తం తిరుపతికి వచ్చిన మోహన్ బాబు మీడియా వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషిని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని అంటూ కామెంట్స్ చేశారు మోహన్ బాబు. తాను బీజేపీ మనిషిని అని చెప్పడంతో వైసీపీకి దూరమైనట్లు పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది. తాజాగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక కేసు విషయంపై మాట్లాడుతూ తాను రియల్ హీరోననీ, విద్యార్ధుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju