NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ వివాదం..! హైకోర్టు తీర్పుపై దేవాదాయ మంత్రి వెల్లంపల్లి స్పందన ఇదీ..!!

Mansas Trust: minister vellampalli Srinivas reaction on high court verdict

Mansas Trust: విజయనగరం జిల్లా మాన్సాస్ , సింహాచలం ఆలయాల ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పలు విషయాలపై చర్చించారు. మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన పలు అంశాలను వివరించారు. తదుపరి హైకోర్టు తీర్పుపై స్పందించారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళతామని తెలిపారు. హైకోర్టు తీర్పునకు సంబంధించి పూర్తి ఉత్తర్వులు అందలేదనీ, ఆ తీర్పును పరిశీలించి ముందుకు వెళతామన్నారు. అప్పీల్ లో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి.

Mansas Trust: minister vellampalli Srinivas reaction on high court verdict
Mansas Trust minister vellampalli Srinivas reaction on high court verdict

Read More: AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్..! మాన్సాస్ ట్రస్ట్ జీవో కొట్టివేత..!!

వివాదం ఏమిటంటే…

పూసలపాటి వంశీయులైన దివంగత పివిజీ రాజు 1958లో మహారాజ అలక్ నారాయణ సొసైటి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ ను స్థాపించారు. ఆయన తదనంతరం ట్రస్ట్ బైలా ప్రకారం పివిజీ రాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగారు. 2016 లో ఆనంద గజపతిరాజు మరణానంతరం మాన్సాస్ చైర్మన్ పదవిని పీవీజీ రాజు రెండవ కుమారుడు అశోక్ గజపతిరాజు చేపట్టారు. అయితే గత ఏడాది మార్చి నెలలో జగన్మోహనరెడ్డి సర్కార్ జివో 72 ద్వారా అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో దివంగత ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జివోను అశోక్ గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేయగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Mansas Trust: minister vellampalli Srinivas reaction on high court verdict
Mansas Trust minister vellampalli Srinivas reaction on high court verdict

కాగా హైకోర్టు తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ గా తాను అక్రమాలకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులను, సిబ్బందిని చాలా ఇబ్బందికి గురి చేశారనీ, తనపై పగతోనే మాన్సాస్ కార్యాలయాన్ని తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju