NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mansas Trust: టార్గెట్ అశోక్ గజపతి ఫిక్స్..! వారంలోనే అరెస్టు..!?

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఉన్న సంచయిత గజపతిరాజు స్థానంలో హైకోర్టు తీర్పుతో అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టడంతో ఆయనన ఎలాగైనా మళ్లీ పదవీచ్యుతుడిని చేసి జైలుకు పంపించాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ భూముల విషయంలో అక్రమాలను వెలికి తీసి అశోక్ గజపతిరాజును జైలుకు పంపడం ఖాయమంటూ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Mansas Trust target Ashok
Mansas Trust target Ashok

Read More: Download Disha APP: నేటి దిశ – నాటి నాలుగో సింహం..! కానీ ఫీచర్లు అధరహో..!!

భూఅక్రమాలపై దర్యాప్తును వేగవంతం చేసిన ప్రభుత్వం

ఈ క్రమంలో ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం ఆలయ భూముల్లో ఆక్రమాలకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసింది. భూ అక్రమాలు జరిగినట్లు ప్రాధమిక విచారణలోనే దేవాదాయ శాఖ నిర్ధారణకు వచ్చింది. అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్న సమయంలో చట్టవిరుద్దంగా 22ఏ జాబితా నుండి భూములను తొలగించాలని గుర్తించారు. ఆ సమయంలో కార్యనిర్వహణాధికారిగా పని చేసిన దేవాదాయ శాఖ ఏసి రామచంద్ర మోహన్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రామచంద్ర మోహన్ ను ప్రభుత్వానికి సెరండర్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్న సమయంలోనే అక్రమాలు జరిగాయని నిరూపించి ఆ విచారణ నివేదిక ద్వారా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ప్లాన్ చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. భూ అక్రమాల్లో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేస్తున్నారు. త్వరలో విచారణ నివేదిక ప్రభుత్వానికి అందుతుందనీ, ఆ తరువాత చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Mansas Trust target Ashok
Mansas Trust target Ashok

Mansas Trust: అశోక్ ఎందుకు టార్గెట్ అయ్యారంటే…

జగన్ అక్రమాస్తులకు సంబంధించి గతంలో టీడీపీ నేతలు ఎర్రం నాయుడు, అశోక్ గజపతిరాజు కోర్టులో కేసు వేశారు. ఆ కక్షతోనే ఆ కుటుంబాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎర్రంనాయుడు చనిపోవడంతో ఆయన సోదరుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసిన వారిలో ఇక మిగిలింది అశోక్ గజపతిరాజు. తొలి దెబ్బగా ఆయనను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుండి తొలగించింది అశోక్ సోదరుడి కుమార్తె సంచయిత గజపతిరాజును చైర్ పర్సన్ గా నియమించింది. అయితే అశోక్ కోర్టును ఆశ్రయించి మళ్లీ చైర్మన్ గా నియమితులు కావడంతో ఇక అక్రమాలు వెలికి తీసి జైలుకే పంపాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనబడుతోంది.

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju