మార్గదర్శి చిట్స్ కేసులో చిట్స్ చార్టెడ్ అకౌంటెంట్ కూడరవల్లి శ్రవణ్ ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ లో అక్రమాలు, మోసాలు, నిధుల మళ్లింపు జరిగాయని ఇప్పటికే కేసు నమోదు చేసి ఏపీ సీఐడీ అధికారులు .. తాజాగా సీఏ శ్రవణ్ ను అదుపులోకి తీసుకుంది. ల్యాప్ టాప్, పలు రికార్డులను సీఐడీ సీజ్ చేసింది. మార్గదర్శి అడిటింగ్ నిర్వహించే బ్రహ్మయ్య అండ్ కో లో అఫిషియల్ పార్టనర్ గా కూడరవల్లి శ్రవణ్ ఉన్నారు. సీఐడీ అధికారులు అరెస్టు చేసిన శ్రావణ్ ను విజయవాడ 3వ మెట్రో పొలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు.

వందల కోట్ల డిపాజిట్ కు సంబంధించిన వివరాలను శ్రవణ్ వెల్లడించలేదని తెలిపారు. నిన్న, మొన్న హైదరాబాద్ లోని అడిట్ కంపెంనీ బ్రహ్మణ్య అండ్ కో లో ఏపీ సీఐడీ సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్ లను సీజ్ చేసింది. ఏపీ సీఐడీ సోదాలపై బ్రహ్మయ్య అండ్ కో భాగస్వామి పి చంద్రమౌళి బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించి తదుపరి విచారణ దాకా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఈ నెల 31వ తేదీ మొదటి కేసుగా విచారణ చేపడతామని తెలిపింది.
మరో పక్క ఈ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని కోరుతూ ఏపీ సీఐడీ మార్గదర్సి ఎండి శైలజా కిరణ్ కు నోటీసులు కూడా జారీ చేసింది.
నా సీటును అమ్ముకున్నారంటూ మేకపాటి సంచలన కామెంట్స్