వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి అంటారు పెద్దలు అప్పుడు దాని విలువ…. దానిలోని గుణాలు మెరుగుపడతాయి అంటారు.. ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అనుసరించనున్నారు. హిందూ ఆలయాల ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలకు తగ్గట్టుగా… ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో జగన్ ఒక కొత్త ఆలోచన చేశారు… దీన్ని కొత్త ఆలోచన అనేకంటే విపక్షాలపై ఎదురు దాడికి ఆయన సై అంటూ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఎల్లుండు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆట కట్టించడం తోపాటు, హిందుత్వమే ఎజెండాగా రాష్ట్రంలో పాటు పోవాలని చూస్తున్న బీజేపీ సైతం ఇరుకున పెట్టేందుకు జగన్ ఈ ప్రత్యేకమైన వ్యూహాన్ని సిద్ధం చేశారు.
** 2016 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కరాల ఘాట్ లు ఇతర స్నాన ఘాట్ లు నిర్మించే క్రమంలో విజయవాడలో అత్యంత పురాతనమైన ఆలయాలను టిడిపి ప్రభుత్వం కులగొట్టింది.
** విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నా దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి గుడి సీతమ్మ వారి పాదాలు రాహుకేతువులు బొడ్డు బొమ్మ గోసాల కృష్ణుడు దేవాలయాలతో పాటు 4వ శతాబ్దం నాటి వీరభద్రస్వామి ఆలయం కూల్చివేయడం పెద్ద వివాదం అయింది. విజయవాడకు క్షేత్రపాలకుడిగా వీరభద్ర స్వామిని భావిస్తారు. ముఖ్యంగా ఈ ఆలయానికి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువ. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాన్ని కనీసం పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు అప్పట్లో కూల్చివేశారు. వన్ టౌన్ లో పలకపైన వినాయక ఆలయం సీతమ్మవారి పాదాల దగ్గర ఉన్న ప్రముఖ శనీశ్వరాలయం కూడా కూల్చేశారు. ఈ శనీశ్వర ఆలయానికి సైతం దక్షిణ భారతదేశంలో ప్రత్యేకత ఉంది. ఇవి చాలవన్నట్లు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న ప్రసిద్ధ పాతాళ వినాయకుడు ఆలయం, బస్టాండ్ ఎదురుగా ఉన్న శిరిడి సాయి మందిరం, కృష్ణలంక లోని ఎంతో మందికి ఇష్టమైన ఆంజనేయ స్వామి ఆలయం శంకర మఠం శివాలయం రాహుకేతు ఆలయాలను సైతం ఎవరిని అడగకుండా కులగొట్టారు. అలాగే రోడ్డుకు అడ్డంగా లేకపోయినా వన్ టౌన్ లోని భవాని ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం రామాలయం తో పాటు గోశాల సైతం తొలగించారు. భవానిపురం లోనూ స్వయంభు అమ్మవారి ఆలయం దుర్గ గుడి పై భవాని మండపాన్ని తీసివేశారు. ఇలా కృష్ణా పుష్కరాల సమయంలో 42 హిందూ ఆలయాలను టిడిపి ప్రభుత్వం కూల్చివేసిన లెక్కలున్నాయి. అప్పట్లో హిందూ ధార్మిక సంస్థలు అడపాదడపా నిరసనలు చేపట్టిన దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తరాలు సజావుగా సాగాలంటే కచ్చితంగా ఆలయాలు తొలగింపు అనివార్యం అంటూ వాదించింది. ఇప్పుడు ఈ ఆలయాలను పునరుద్ధరించడానికి టీడీపీ హయాంలో కూలిపోయిన ప్రఖ్యాత ఆలయాలను మళ్లీ పునర్నిర్మించేందుకు జగన్ ఎదురుదాడి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.
** కూలిపోయిన ఆలయాల్లో కొన్ని ఆలయాలను నిర్మించడంతో పాటు పదమూడు జిల్లాల్లో దాదాపు నలభై ఆలయాలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించేలా జగన్ చొరవ తీసుకోనున్నారు. హిందుత్వాన్ని తమ ప్రభుత్వం ఏది పట్టించుకోకుండా లేదని ఆలయాలు నిర్మించడం వల్ల తాము ముందుంటామని… జగన్ ప్రభుత్వం ఒక సంగీతం ఇవ్వడానికి సిద్ధమైంది. దీనికి ఎల్లుండి జగన్ విజయవాడలో శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జగన్ అనుసరిస్తున్న వ్యూహం ప్రకారం టిడిపి మాత్రమే కాదు ఏకకాలంలో రెండు పిట్టలను కొట్టాలనే కోణంలో బీజేపీ సైతం దీనిలో ఇరికించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. 2016 లో టిడిపి ప్రభుత్వం మిత్రపక్షంగా బిజెపి ఉంది. ఆ సమయంలో అన్ని ఆలయాలను కొల్లగొడుతున్న ఏమీ అనని బీజేపీ ఇప్పుడు సాధారణంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు కావాలనే రాజకీయ ఎత్తుగడ పెద్దవి చేసి చూపిస్తుందని జగన్ ఎదురు దాడికి దిగే అవకాశం ఉంది. తమ ప్రభుత్వం హిందుత్వానికి తగిన గౌరవం ఇస్తుందని ఆలయాల సైతం తామే నిర్మిస్తామని చెప్పడంతో… ప్రస్తుత వివాదం లోని తన కోర్టులో ఉన్న బాల్ ను విపక్షాలకు రక్షణాత్మక ధోరణి తరహాలో జగన్ తరలించనున్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యూహమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…