NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Minister Buggana Rajendranath reddy: రాష్ట్ర మంత్రికి షాక్ ఇచ్చిన కేంద్ర భద్రతా సిబ్బంది..!సీఎంఒకు ఫిర్యాదు..!?

Minister Buggana Rajendranath reddy: సాధారణంగా విమానాశ్రయాలకు వీవీఐపీలు వచ్చిన సందర్భంలో పలువురు నేతలకు భద్రతా సిబ్బంది నుండి పరాభవాలు ఎదురవుతుంటాయి. వీవీఐపీలు వచ్చిన సందర్భంలో జిల్లాస్థాయి అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరిని అనుమతించాలి అనే దానిపై  పేర్లు, వారి హోదాలతో వివరాలను  విమానాశ్రయ అధికారులకు ముందుగా ఇస్తుంటారు. ప్రోటోకాల్ లిస్ట్ లో ఉన్న అధికారులు, నేతలను వీఐపీ గేటు గుండా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇస్తారు. అయితే ఇక్కడ ఎలా పొరబాటు జరిగిందో తెలియదు కానీ రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి కేంద్ర భద్రతా సిబ్బంది నుండి ఊహించని పరాభవం ఎదురైంది.

Minister Buggana Rajendranath reddy insulted at renigunta airport
Minister Buggana Rajendranath reddy insulted at renigunta airport

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు స్వాగతం చెప్పేందుకు గానూ మంత్రి బుగ్గన వీఐపీ గేటు నుండి వెళుతుండగా కేంద్ర భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది. ఆయనను పక్కకు తోసివేయడంతో మంత్రి తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఈ సందర్భంలో కేంద్ర భద్రతా సిబ్బందితో మంత్రి బుగ్గన వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కారణంగా ఆయన కేంద్ర మంత్రి గోయల్ ను కలవలేకపోయారు. ఈ విషయంపై మంత్రి బుగ్గన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విమానాశ్రయ సిబ్బంది కల్పించుకుని సర్దిచెప్పి పంపించారు.

Read More: Maharastra: వాహనదారులకు ఇది ఎంత శుభవార్తో…లీటర్ పెట్రోల్ రూపాయేనంట..! ఎక్కడ..! ఎప్పుడంటే..!?

విషయం ఏమిటంటే…రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రబుత్వం తరపున స్వాగతం పలికేందుకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లారు. ఆయితే వీఐపీ గేటు వద్ద కేంద్ర భద్రతా సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. తాను మంత్రిని అని చెప్పి ప్రవేశించే ప్రయత్నం చేయగా కేంద్ర భద్రతా సిబ్బంది ఆయనను బలంగా వెనక్కి నెట్టివేయడంతో కిందపడే పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్ర మంత్రిని బుగ్గన కలవలేకపోయారు. ఈ సందర్భంలో తనను అడ్డుకున్న భద్రతా సిబ్బంది వివరాలు ఇవ్వాలని విమానాశ్రయ అధికారులను బుగ్గన కోరగా అధికారులు ఆయనకు సర్ధిచెప్పి ప్రయత్నం చేశారు. అయితే బుగ్గన కు జరిగిన అవమానంపై మంత్రి కార్యాలయ అధికారులు సీఎంఒకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N