NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Peddireddy : నిమ్మగడ్డ సారూ…! ఈ ఎన్నికలు పూర్తి చేసి వెళ్లండి..!!

Peddireddy : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభానికి ముందు వరకూ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం ఎన్నికలు జరగడానికి వీలులేదని పట్టుబట్టిన వైసీపీ వర్గాలు ఇప్పుడు పూర్తిగా మాట మార్చేశాయి. ఎన్నికల ముందు వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి, ఆయన చెప్పినట్లు ఆడుతూ ఉంటాడు అని విమర్శించిన వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పుడు ఆయనకు సహకరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడంతో ప్రశాంతంగా పూర్తి అయ్యాయి. అధికార వైసీపీ మద్దతుదారులు 70 నుండి 80 శాతం స్థానాల్లో విజయం సాధించారు. ఆ వెంటనే పురపాలక ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, 11 నగర పాలక సంస్థలు వైసీపీ కైవశం చేసుకుంది.

Minister Peddireddy comments on elections
Minister Peddireddy comments on elections

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే  ఎన్నికల ముందు వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డకు కొమ్ముకాసిన టీడీపీ వర్గీయులు ఎన్నికల నేపథ్యంలో ఆయనపై  విమర్శలు చేయడం ప్రారంభించారు. అప్పటి వరకూ నిమ్మగడ్డ ను విమర్శించిన వైసీపీ శ్రేణులు మాత్రం నిమ్మగడ్డపై అభాండాలు వేయడం మానేశారు. ఇప్పుడు తాజాగా ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసి వెళ్లాలని కోరుతున్నారు. జడ్‌పీటీసీ, ఎంపిటీసీల ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది.

ఈ నేపథ్యంలో సాక్షత్తు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని ఎస్ఈసీని కోరారు. ఈ నెలాఖరుకు ఎస్ఈసీగా  నిమ్మగడ్డ రమేష్ కుమార్  రిటైర్ అవుతారు. ఈ లోపుగానే ఎన్నికలు నిర్వహించి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు కేవలం ఆరు రోజుల సమయం సరిపోతుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలంటే స్థానిక ఎన్నికలు పూర్తి కావాల్సి ఉందన్నారు. దేశ వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతుంటే ఏపిలో ఎన్నికల వల్ల ఆలస్యం అవుతోందన్నారు. పరిషత్ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju