AP 10th Exams: ఏపిలో టెన్త్ స్టూడెంట్స్ అందరూ పాస్..? మంత్రి క్లారిటీ..!!

Share

AP 10th Exams: కోవిడ్ కారణంగా గడచిన రెండు సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్ధులు అందరు పాసయ్యారు. అందరినీ పరీక్షలు రాయకుండానే పాస్ చేసేశారు. ఈ సంవత్సరం పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతాయి అనుకుంటే సంవత్సరం మొత్తం తరగతులు సాఫీగానే సాగాయి. పరీక్షలకు విద్యార్ధులు సిద్ధం అవుతున్నారు. కానీ ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా మూడవ దశ పెరుగుతుండటం, ఓమిక్రాన్ వల్ల పలు పాఠశాలలు మూతపడుతుండటం, పక్క రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతుంటంతో అసలు మన రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయా లేదా సందేహం నెలకొంది. గత రెండేళ్ల మాదిరిగానే ఈ సారి కూడా అందరూ పాస్ యేనా అన్న సందేహం నెలకొంది. దీనిపై ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు స్పందించారు. విద్యార్ధులు అందరూ గతంలో మాదిరిగా పరీక్షలు జరగవు. పాస్ చేస్తారు అనుకుంటున్న తరుణంలో, పరీక్షలు జరగవేమో అన్న పుకార్లు వ్యాపిస్తున్న దశలో మంత్రి సురేష్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.

Minister suresh clarifies on AP 10th Exams
Minister suresh clarifies on AP 10th Exams

 

Read More:Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ముందే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్, ఫిట్ మెంట్ 23 శాతం, పదవీ విరమణ వయసు పెంపు..

AP 10th Exams: మార్చిలో పదవ తరగతి పరీక్షలు

కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉంది. టెన్త్ పరీక్షలపై వినుకొండలో మంత్రి సురేష్ మాట్లాడుతూ మార్చిలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సంక్రాంతి నాటికి సిలబస్ మొత్తం పూర్తి చేయాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ సారి ఏడు సబ్జెక్ట్ ల్లో పరీక్షలు ఉంటాయని ఉంటాయని మంత్రి సురేష్ వివరించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాల అమలులో జగన్మోహనరెడ్డి సర్కార్ వెనుకంజ వేయడం లేదని తెలిపిన మంత్రి సురేష్..అమ్మఒడి మూడవ విడతను విద్యాసంవత్సరం ఆరంభంలో ఇస్తామని తెలియజేశారు.


Share

Related posts

బిగ్ బాస్ 4:- గ్లామర్ డోస్ తగ్గినట్లే..!!

sekhar

Bheemla nayak: ఈ సాంగ్ తో స్పీకర్లు బ్లాస్ట్ అవ్వడం గ్యారెంటీ..థమన్

GRK

సినిమా షూటింగ్ లోనూ టపటపా ఏడ్చేసిందట మోనల్?

Varun G