ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Village volunteer: వాలంటీర్ వక్రబుద్ది.. బాలికపై అత్యాచారం

Share

Village volunteer: ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించాలన్న సదుద్దేశంతో వాలంటీర్ ల వ్యవస్థను తీసుకువచ్చారు. 50 నుండి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ తమ సేవలను అందిస్తున్నారు. వృద్దాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లను నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వారి పరిధిలోని అర్హులైన లబ్దిదారులకు వివరించి వారికి లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఎక్కవ శాతం మంది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా తమ విదులను సక్రమంగా నిర్వహిస్తూ ఇటు అధికారుల నుండి ప్రశంసలు, ప్రజల నుండి మన్ననలు పొందుతుండగా, కొందరు చేస్తున్న పనులు ఆ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చే విధంగా ఉంటున్నాయి.

Village volunteer: మైనర్ బాలికపై అత్యాచారం

ఇటీవల ఓ వాలంటీర్ లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన పెన్షన్ డబ్బులు తీసుకుని ప్రియురాలితో ఉడాయించాడు. అందకు ముందు గుంటూరు జిల్లాలో ఓ మహిళా వాలంటీర్ ప్రభుత్వ పథకాలు రావాలంటే కొంత ఫీజు లబ్దిదారులు చెల్లించాలంటూ ఒక్కో పథకానికి ఇంత రేటు అంటూ వల్లే వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కొన్ని చోట్ల అవినీతికి పాల్పడుతున్న వాలంటీర్లను తొలగించారు. ఈ ఘటనలు మరువకముందే ఓ వాలంటీర్ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

వాలంటీర్ సతీష్ పై పొక్సో యాక్ట్

వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలిలంక గ్రామానికి చెందిన వాలంటీర్ బూసి సతీష్ (23) ఓ బాలికకు మాయమాటలు చెప్పి దగ్గర అయ్యాడు. ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు. అయితే కొద్ది రోజులుగా ఆ బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు విషయంగా గట్టిగా ఆరా తీయగా విషయాన్ని చెప్పేసింది. దీంతో వారు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. వెంటనే వాలంటీర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు వాలంటీర్ సతీష్ పై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Share

Related posts

పవన్ నోట బాబు తప్పిదం మాట… సైనికులు హ్యాపీ!

CMR

Loan: కారు లేదా బైక్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి.. గుడ్డిగా తీసుకుంటే దబిడి దిబిడే.!

Ram

“నో ఛాన్స్” కేసీఆర్ ఐడియాకి జగన్ ససేమిరా?

CMR
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar