Nellore YSRCP: నెల్లూరు జిల్లాకే చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న కారణంతో పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం తెలిసిందే. వీరిలో ముఖ్యమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి అండగా నిలిచిన మేకపాటి కుటుంబానికి చెందిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా ఉండటంతో జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఆయన సోదరుడు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిల మద్దతు లేదని ప్రచారం జరుగుతోంది.

మరో పక్క బహిష్కరణకు గురైన చంద్రశేఖర్ రెడ్డి వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో సత్తా ఏమిటో చూపిస్తానని పేర్కొంటున్నారు. తొలి నుండి వైఎస్ఆర్ కు తమ కుటుంబం అండగా ఉందని చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి పై వేటు పడిన నేపథ్యంలో ఆయన అన్న కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ రెడ్డి ఈ అంశాలపై స్పందించారు.
తనపై పచ్చ బ్యాచ్ అసత్య ప్రచారాలు చేస్తొందని మండిపడ్డారు విక్రమ్ రెడ్డి. పార్టీ మారబోతున్నట్లుగా వస్తున్న ప్రచారం ఉత్తదేనన్నారు. వీధి కుక్కల ప్రచారం తాను పట్టించుకోనని పేర్కొన్నారు. బాబాయ్ చంద్రశేఖరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అలాగే ఇంటి పేరు వదిలివేస్తే ఆయన శక్తి ఏమిటో ఆయనకు తెలిసి వస్తుందని అన్నారు. పార్టీని దిక్కరిస్తే ఎవరిపైనా అయినా చర్యలు తప్పవని పేర్కొన్నారు విక్రమ్ రెడ్డి. మేకపాటి కుటుంబం ఎప్పుడూ సీఎం వైఎస్ జగన్ తోనే ఉంటుందని, ఆయనతోనే ప్రయాణం సాగిస్తుందని తెలిపారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం వైఎస్ జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలను గెలిచి సీఎం వైఎస్ జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 3న గడపగడపకు మన ప్రభుత్వంపై మళ్లీ సమీక్ష .. ఈ కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చేస్తారు(గా)..?