MLA RK Roja: వావ్..రోజా క్రియేటివిటీ అధుర్స్..! జగనన్న ‘బెర్త్’ కన్ఫర్మ్ చేసినట్లేగా..!?

Share

MLA RK Roja: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణ పై దృష్టి కేంద్రీకరించినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీపావళి పండుగ లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా అంటున్నారు. ఎవరెవరికి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుందనే మాటలు వినబడుతున్నాయి. ఆశవహులు ఎక్కువగానే ఉన్నారు. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజాకు తొలి సారి మంత్రివర్గంలోనే చోటు లభిస్తుందని ఆశించారు. కానీ సామాజిక, ప్రాంతీయ ఈక్వేషన్‌లో జగన్.. రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దీంతో ఆమె కొద్ది రోజులు నిరుత్సాహంగా ఉండిపోయారు. ఆ తరువాత ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇటీవలే ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమెను ఆ పదవి నుండి తప్పించి వేరే వారికి ఇచ్చారు. దీంతో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రోజు చోటు ఖాయమని వార్తలు వస్తున్నాయి.

MLA RK Roja felicitation to cm jagan with variety shawl
MLA RK Roja felicitation to cm jagan with variety shawl

Read More: CM YS Jagan: తిరుమల నుండి తిరుగు ప్రయాణమైన సీఎం వైఎస్ జగన్..! మళ్లీ అదే వివాదం..!!

MLA RK Roja: ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టు శాలువాతో సత్కారం

ఈ తరుణంలో ఆర్‌కే రోజా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఓ వెరైటీ శాలువాతో సత్కరించి చూపరులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ తిరుపతికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో సీఎం జగన్ ను రోజా ప్రత్యేక శాలువాతో సత్కరించి ఆహ్వానం పలికారు. దివంగత సీఎం వైఎస్ఆర్, సీఎం జగన్ ఫోటోలతో ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టు శాలువాతో జగన్ ను సత్కరించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రోజా దగ్గర ఉండి ప్రత్యేకంగా ఈ పట్టు శాలువాను తయారు చేయించినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనలో నేతలు రెడిమెడ్‌గా కొనుగోలు చేసిన శాలువాతో సత్కరించి బొకేలు అందజేస్తుంటారు. వీటిలో ఏమి ప్రత్యేకత ఉండదు. ఇప్పటి వరకూ మార్కెట్ లేని దాన్ని తయారు చేయించి తీసుకురావడంలోనే క్రియేటివిటీ ఉంది. ప్రత్యేకంగా పట్టు శాలువా తయారు చేసించి రోజా తన ప్రత్యేకతను చాటుకుని సీఎం జగన్ ను ఫిదా చేశారు. కాగా దీన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో నెటిజన్ లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రోజాకు మంత్రి పదవి ఖాయమేనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

అయోధ్య అయింది… ఇక బీజేపీ చూపు ఎక్కడ..?

somaraju sharma

గాల్వాన్ లోయ దాడి విషయంలో చైనానే తిడుతున్న చైనీయులు..!

arun kanna

ప్రపంచంలో కెల్ల అతిపెద్ద వింత.. సృష్టించబోతున్న సౌదీ..!!

sekhar