MLA Roja: చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు..!!

Share

MLA Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరో మారు టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తూ  సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న విమర్శలపై నేడు ఆర్ కే రోజా స్పందిస్తూ .. జగన్ ఉన్నంత వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు, లోకేష్ ఎమ్మెల్యే కాలేడని విమర్శించారు. వరదల నేపథ్యంలో జగన్ ఏరియల్ సర్వే చేయడంపై చంద్రబాబు విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు గతంలో ఏరియల్ సర్వే చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వరద బాధితుల వద్ద బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయంలో ఏనాడైనా కోటి రూపాయల పరిహార ఇచ్చారా అని ప్రశ్నించారు.

MLA Roja serious comments on chandra babu
MLA Roja serious comments on chandra babu

Read More: Megastar Chiranjeevi: ఏపిలో ఆన్‌లైన్ టికెటింగ్ పై మెగాస్టార్ ‘చిరు’ స్పందన ఇదీ..! అభినందిస్తునే..ఆ అభ్యర్ధన..!!

MLA Roja: కుప్పం దెబ్బకు పిచ్చెక్కింది

చంద్రబాబుకు కుప్పం దెబ్బకు పిచ్చి ఎక్కిందనీ, ఆయన ఏమి మాట్లాడుతున్నరో ఆయనకే తెలియడం లేదన్నారు. అందుకే అసెంబ్లీలో వైసీపీ నేతలు అనని మాటాలను అన్నట్లుగా వరద బాధితుల వద్ద చెబుతూ సానుభూతి డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పే మాటలు జనాలు నమ్మరని, ఆయన మాటలు నమ్ముతారని అనుకుంటే పొరపాటు అవుతుందన్నారు. వరదలు మానవ తప్పిదం ఎలా అవుతుందో చంద్రబాబు చెప్పాలన్నారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని భావంచి ఏరియల్ సర్వేకు వెళ్లారని అన్నారు. చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తూ సానుభూతి డ్రామాలు అడుతున్నారని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలు తన శాడిజంకు పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. పుష్కరాల సమయంలో తొక్కిసలాట సీసీ పుటేజీ బయటపెడితే చంద్రబాబు శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుని చిప్పకూడు తినేవాడని అన్నారు. నాడు సోనియా గాంధీతో కుమ్మక్కై జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించిన రోజా .. సోనియా గాంధీ నుండి  శంకరరావు వరకూ ఏమయ్యారో తెలుసుకోవాలన్నారు.


Share

Related posts

Amith Shah: రేపు ఏపికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాక..! ఎందుకంటే..?

somaraju sharma

మంత్రి నానిపై దాడి … మ‌ధ్య‌లో ఆమె ఎందుకు ఎంట్రీ ఇచ్చిందంటే…

sridhar

పవన్ కళ్యాణ్ కి అతని అభిమానుల పై ఉన్న ప్రేమ చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి..!

arun kanna