MLA Vallabhaneni Vamsi: గన్నవరం నియోజకవర్గ వైసీపీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్ధిని అని యార్లగడ్డ వెంకట్రావు అంటే తానే వైసీపీ నుండి పోటీ చేయనున్నట్లు వల్లభనేని వంశీ పేర్కొంటున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలు ఇటీవల కాలంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ వంశీ, యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేతల మధ్య విభేదాల కారణంగా ఒకరినొకరు విమర్శించుకునే క్రమంలో పలు తప్పిదాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో లక్షలాది మందికి జగన్ సర్కార్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి గానూ చేసిన భూసేకరణలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దారి డొంక లేకపోవడం, కనీస వసతులు లేకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణాలకు లబ్దిదారులు చాలా ప్రాంతాల్లో ముందుకు రావడం లేదని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఈ తరుణంలో వల్లభనేని వంశీ కూడా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన భూసేకరణపై సంచలన కామెంట్స్ చేశారు.
నియోజకవర్గంలో దారి డొంక లేని కొన్ని ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. ఈ భూసేకరణ ఎవరు చేశారో తెలుసు. ఆ స్థలాలకు వెళ్లాలంటే హెలికాఫ్టర్ లో లబ్దిదారులు వెళ్లాలి. ఇవన్నీ బయటకు మాట్లాడితే ప్రభుత్వ మంచి ఉద్దేశానికి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, దాన్ని ఏదో విధంగా సరి చేస్తున్నామని అన్నారు వల్లభనేని వంశీ. అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలంటే మెరకకు ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. మాంసం కంటే మసాలాకు ఎక్కువ ఖర్చు అయినట్లు అవుతుందని వంశీ వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేనే జగనన్న కాలనీల కోసం జరిగిన భూసేకరణలో జరిగిన తప్పిదాలను వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో లబ్దిదారుల ఇబ్బందులపై ప్రభుత్వ, వైసీపీ పెద్దలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…