Subscribe for notification

MLC Elections : ఏపి, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

Share

MLC Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. మార్చి 14 ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఏపిలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ – ఖమ్మం – వరంగల్లు స్థానంతో పాటు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో జంబో బ్యాలెట్ ను సిద్ధం చేశారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కావడంతో రాజకీయ ప్రమేయంతో వాడివేడిగా ఎన్నికల ప్రచారం జరిగింది. దీంతో మీడియాలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కవరేజ్ ఎక్కువగానే కనిపించింది. ఏపిలో ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం, ఇందులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పోటీ చేస్తుండటంతో పెద్దగా ప్రచార ఆర్భాటాలు కనిపించలేదు. అయితే పలు చోట్ల నిన్న మొన్న ఉపాధ్యాయ ఓటర్లకు నగదు, బహుమతులు పంపిణీ చేస్తూ దొరికిపోవడంతో మీడీయాలో ప్రముఖంగా వచ్చాయి.

MLC Elections poling

తెలంగాణలో మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 93 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 5,36,268 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బాక్సులు చొప్పున 150 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల కోసం మొత్తం 3,835 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వారిలో 959 మంది పిఓలు, 2,876 మంది ఓపిఓలు ఉన్నారు. వరంగల్లు – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 5,05,565 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏపిలో కృష్ణా – గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 13,505 ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 111 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు,. తుర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 17,467 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్ సమయంలో కోవిడ్ నిబందనలు పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం నిబంధనలు పాటించాలి. ఓటరు స్లిప్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని వీడియో గ్రఫీ తీయనున్నారు.


Share
somaraju sharma

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

39 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

1 hour ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

3 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

4 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

5 hours ago