NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MLC Shaik Sabjee: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం .. జగన్, చంద్రబాబు సంతాపం

MLC Shaik Sabjee:  ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైయ్యారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. భీమవరంలో అంగన్ వాడీ కార్యకర్తల నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు ఆయన ఏలూరు నుండి కారులో వెళుతుండగా, భీమవరం నుండి ఆకివీడు వైపు వెళుతున్న కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, గన్ మెన్, ఆయన పీఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ లో భీమవరం ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పట్ల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ సాబ్జీ మరణవార్త తెలియడంతో సీఎంతో పాటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఎమ్మెల్సీ సాబ్జీ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు చంద్రబాబు. ఈ ఘటన అత్యంత విషాదకరమని అన్నారు. అంగన్ వాడీల పోరాటానికి మద్దతు తెలిపి.. అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం విచారకరమని పేర్కొన్నారు. తన చివరి ఘడియల్లోనూ ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్ సాబ్జీ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుగా సేవలు అందించారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఇంకా అయిదేళ్ల సర్వీస్ ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరి లో సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నుండి విజయవాడ వరకూ జరిగిన పాదయాత్ర కు నాయకత్వం వహించారు. 2021 లో యూటీఎఫ్, ఏపీటీఎఫ్ -1938, పీడీఎఫ్ తో పాటు 25 ఉపాధ్యాయ సంఘాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్ధిగా తూర్పు గోదావరి – పశ్చిమ గోదావరి  ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు.

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ .. కీలక నిర్ణయాలు ఇవే

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!