NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టాప్ స్టోరీస్ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

Narendra Modi: One Single Step by Modi in 2nd Wave

Corona: క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్. అయితే, దేశంలో క‌రోనా వ్యాక్సీన్లకు తీవ్రంగా కొరత ఉంది. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ల కొర‌త కొన్ని రాష్ట్రాల‌ను వెంటాడుతుండ‌టంతో కేంద్రం వైపు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో కేంద్రం సైతం త‌న‌ వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. వ్యాక్సినేష‌న్ ఈ ఏడాది డిసెంబ‌ర్ చివ‌రి నాటికి పూర్తి చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టిస్తోంది. అయితే, దీనిపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ స‌మ‌యంలోనే ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా మ‌రో సీఎం ఈ మేర‌కు లేఖ రాశారు.

Read More: Corona: షాక్ః ప‌క్క రాష్ట్రంలో కొత్త ర‌కం క‌రోనా కేసు
మోడీ టీం అలా చేయ‌ల‌ట‌

భవిష్యత్తులో తలెత్తే క‌రోనా వైరస్ వేవ్‌ల నుంచి దేశంలోని ప్రజలను కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. అయితే, వ్యాక్సీన్ కొనుగోలులో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వమే టీకాల‌ కొనుగోలు చేసేలా అందరూ ఏకాభిప్రాయానికి రావాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి పట్నాయక్ లేఖ రాశారు. క‌రోనా విష‌యంలో దేశంలో ఇప్పటికే రెండు వేవ్‌లు ఎదుర్కున్నామ‌ని సెకండ్ వేవ్ సృష్టించిన‌ కల్లోలం తర్వాత.. భవిష్యత్తులో తలెత్తే ప‌రిణామాలపై ప్రజల్లో భయాందోళనలు క‌లుగుతున్నాయ‌ని ప‌ట్నాయ‌క్ ఈ లేఖ‌లో పేర్కొన్నారు. రాష్ట్రాలు స్వ‌యంగా టీకాలు కొనుగోలు చేయ‌ని ప‌రిస్థితి ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సీన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందించడం స‌రైన మార్గమని ఈ లేఖ‌లో ప‌ట్నాయ‌క్ పేర్కొన్నారు.

Read More: Corona: క‌రోనాతో కాదు ఎలుక‌ల‌తో చ‌స్తున్నాం… భార‌త్ ను స‌హాయం కోరిన ఆ దేశం

ఇదో గుడ్ న్యూస్‌

క‌రోనా కు చెక్ పెట్టేందుకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లలో ఓ గుడ్ న్యూస్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న టీకాల‌న్నీ రెండు డోసులు వేసుకోవాల్సిన‌వే. అయితే, సింగిల్ డోస్ టీకా ను తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచంలో క‌రోనాకు తొలి వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. ర‌ష్యాలో ఈ వ్యాక్సిన్ ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చింది. వివిధ దేశాల్లో దీనికి అనుమ‌తులు మంజూరు చేశారు. ఇదిలాఉండ‌గా స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమ‌తుల కోసం ఇండియాలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ ద‌ర‌ఖాస్తు చేసింది. ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే త‌గు ప్ర‌క్రియ మొద‌లుపెట్టే అవ‌కాశం ఉంది.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju