Modi: ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చబోతున్న మోడీ..!!

Share

Modi: మోడీ సర్కార్ తీసుకున్న చర్యలతో ఆంధ్రప్రదేశ్ తలరాత మారబోతున్నాయి. ఏపి వేగంగా అభివృద్ధి చెందేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల కేంద్రానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కొరకు అందజేసింది. ఏపి సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి కొత్త ఎక్స్ ప్రెస్ హైవే లను కేటాయించాలన్న జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపి మీదుగా మొత్తం ఆరు కొత్త ఎక్స్ ప్రెస్ హైవేలకు కేంద్రం ఓకే చెప్పింది. ప్రధానంగా పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏపిలో వివిధ ప్రాంతాలను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ఈ ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మించనున్నారు.

దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్ 22 ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మిస్తుండగా అందులో ఆరు ఏపీ మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఆమోదం తెలపడం రాష్ట్రానికి నిజంగా శుభ వార్తే. దేశంలో 2157 కిలోమీటర్ల మేర కేంద్రం ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మించనున్నది. ఇందులో రాష్ట్ర పరిధిలో 378 కిలో మీటర్ల హైవే నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రం నుండి నిర్మాణం జరగనున్న ఆరు ఎక్స్ ప్రెస్ హైవేలు ఏమిటంటే..

  • విజయవాడ – నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ హైవే ను 457 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో 29 కిలోమీటర్ల మేర దీని నిడివి ఉంటుంది. రూ.1218 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేయనున్నారు
  • కర్నూలు – షోలాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే ను 318 కి.మీ మేర నిర్మిస్తారు. ఇందులో రాష్ట్రంలో పది కి.మీ నిడివి ఉంటుంది. రూ.420 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2025 మార్చి నాటికి పూర్తి చేస్తారు
  • హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ హైవే ను 521 కి.మీ మేర నిర్మించనున్నారు. ఏపిలో ఏజన్సీ ప్రాంతాల గుండా సాగే ఈ రోడ్డు రాష్ట్రంలో 72 కి.మీ నిడివి ఉంటుంది. రూ.3024 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కూడా మార్చి 2025 నాటికి పూర్తి చేయనున్నారు
  • బెంగళూరు – చెన్నై ఎక్స్ ప్రెస్ హైవే ను 272 కి.మీ మేర నిర్మించనున్నారు. ఇందులో రాష్ట్రంలోని చిత్తూరు – అనంతపురం జిల్లాలలో 92 కి,మీ నిడివిలో ఉంది. రూ.3864 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మార్చి 2024 నాటికి ప్రారంభించనున్నారు
  • రాయచూర్ – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ హైవే 464 కి.మీ ఉంటుంది. ఇందులో రాష్ట్రంలో వంద కి,మీ మేర నిర్మించనున్నారు. మొత్తం రూ.4200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది
  • చిత్తూరు – చెన్నై ఎక్స్ ప్రెస్ హైవే 125 కిలో మేర నిర్మిస్తారు. ఇందులో రాష్ట్ర పరిధిలో 75 కి,మీ నిడివి ఉంది. రూ.3150 కోట్లతో నిర్మించే ఈ హైవే ను 2024 మార్చి నాటికి పూర్తి అవుతుంది.

Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago