NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో 50 మందికి గాయాలు .. ఆరుగురు పరిస్థితి విషమం

కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం (కర్రల సమరం)లో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏటా విజయదశమి రోజు దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తొంది. బన్నీ ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నెల రోజుల ముందు నుండే అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా స్థానికులు మాత్రం తమ సంప్రదాయాన్ని కొనసాగించారు.

Devaragattu

 

కర్నూలు జిల్లాా హోళగుంద మండలం దేవరగట్టు సమీపంలోని కొండపై వేంచేసి ఉన్న మాళమ్మ, మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కళ్యాణం జరపాల్సి ఉండగా, వర్షం కారణంగా గంట ఆలస్యం అయ్యింది. జల్లులు పడుతున్నా, స్వామివారి కళ్యాణం తర్వాత బన్నీ ఉత్సవం (కర్రల సమరం) నిర్వహించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాల గుట్టు, రక్షపడ, శమీ వృక్షం, ఎదురుబసవన్న ఆలయం ప్రాంతాల్లో దివిటీల వెలుగులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు నెరణికి నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒ జట్టుగా, ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రల తో సమరం చేశారు. ఈ కర్రల సమరంలో 50 మందికి పైగా గాయపడగా, వారిని ఆదోనీ, ఆలూరు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఉత్సవాలను తలకించేందుకు కర్ణాటక, ఏపి సరహద్దు ప్రాంతాల్లోని పది గ్రామాలకు చెందిన సుమారు 2లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చినట్లు అంచనా. అయితే దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ఉత్సవాలను తిలకించేందుకు బయలుదేరిన కర్ణాటక రాష్ట్రం శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి మృతి చెందాడు. అతను గుండెపోటుతో మృతి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju