NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం .. పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Advertisements
Share

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ముదిగుబ్బ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముదిగుబ్బ మండల కేంద్రం నుండి గుడ్డంపల్లి తండాకు వెళ్లే మార్గంలో ఈ ఘటన జరిగింది. చెరువుకట్ట పై నుండి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తుల సమాచారంతో ముదిగుబ్బ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులను ముదిగుబ్బ మండల కేంద్రంలోని టీచర్ల కాలనీకి చెందిన సుకన్య (35), ఆమె కుమార్తెలు దేవయాని (10), జస్మిత (9) గా పోలీసులు గుర్తించారు.

Advertisements
suicide

 

కుటుంబ కలహాలతోనే ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సుకన్య, ఆమె భర్త గంగాధర్ కు మధ్య కొన్ని రోజుల నుండి గొడవు జరుగుతున్నాయని, అందుకే సుకన్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చూపరుల హృదహాయాలను కలచివేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలను భర్త పట్టించుకోడని, అనాధలు అవుతారన్న భావనతో సుకన్య పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుకుంటున్నారు.

Advertisements

YS Jagan: మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఈ కీలక అంశాల గురించే..?  


Share
Advertisements

Related posts

చైనా చాప్ట‌ర్ క్లోజ్‌…భార‌త్‌తో క‌లిసి భారీ ప్లాన్‌?

sridhar

Bigg Boss 5 Telugu: అంతా బాగానే ఉన్నా సన్నీ గేమ్ లో.. ఇదే అతి పెద్ద మైనస్ అంటున్న జనాలు..!!

sekhar

గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త

somaraju sharma