NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

MP Raghurama: రాజుగారిని వైసీపీ బహిష్కరించినట్లేనా..!? వైసీపీ ఎంపీల లిస్ట్‌లో పేరు మాయం..! రఘురామ రియాక్షన్ ఇదీ..!!

MP Raghurama: వైసీపీ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీకి, సీఎం జగన్మోహనరెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాకు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎంపి సభ్యత్వం రద్దు చేయకుండా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగే అవకాశం ఉన్నందున పార్టీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు అయిన తరువాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే వైసీపీ అధికార వైసీపీ అధికార వెబ్ సైట్ లో ఉన్న ఎంపిల జాబితా నుండి నర్సాపురం నుండి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు పేరు మాయం అయ్యింది. దీంతో ఆయనను అధికారికంగా తొలగింపు ప్రక్రియకు వైసీపీ చర్యలు చేపట్టిందా అన్న చర్చ జరుగుతోంది.

MP Raghurama name delited in YCP website
MP Raghurama name delited in YCP website

వైసీపీ అధికార వెబ్ సైట్ నుండి ఎంపిల జాబితాలో రఘురామ కృష్ణం రాజు పేరును తొలగించడంపై ఆయన స్పందించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. వైసీపీ నుండి తనను బహిష్కరించారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పొరబాటున పేరు తొలగించారా లేక కావాలనే చేశారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని రఘురామ కోరారు. కావాలనే తన పేరును వెబ్ సైట్ నుండి తొలగించినట్లయితే పార్టీ నుండి బహిష్కరించినట్లు భావిస్తాననీ పేర్కొన్నారు. 48 గంటల్లో తన పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకువెళతానని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు రఘురామ.

Read More: TMC Leader Mukul Roy: జడ్ కేటగిరి భద్రత ఉపసంహరించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన టీఎంసీ నేత..!!

వైసీపీ అధికార వెబ్ సైట్ లో రాజ్యసభ, లోక్ సభ కు కలిపి మొత్తం 28 పేర్లు ఉండాలి. తిరుపతి నుండి ఇటీవల గెలిచిన గురుమూర్తి పేరును లిస్ట్ లో పెట్టారు గానీ రఘురామ పేరు జాబితాలో లేదు. లిస్ట్ లో 27 పేర్లు మాత్రమే ఉన్నాయి.  ఇప్పుడు ఇది ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎంపి రఘురామ బహిష్కరణపై స్పష్టమైన హామీ లాంటిది ఏమైనా వచ్చి ఉంటుందా అందుకే ఆయన పేరును తొలగించి ఉండవచ్చా అనే చర్చ జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?