NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR Case: ఎంపి రఘురామ ఆరోపణలకు కౌంటర్ లు ఇవీ..! ఇక ఆయన ఎలా సమర్థించుకుంటారో..!!

MP RRR Case: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజును రాజద్రోహం తదితర సెక్షన్ ల కింద ఏపి సీఐడి అరెస్టు చేయడం, ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సికింద్రాబ్ ఆర్మీ ఆసుపత్రి నుండి బయటకు రావడం తెలిసిందే. ఆర్మీ ఆసుపత్రి నుండి ఢిల్లీకి వెళ్లిన వెంటనే రఘురామ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ను కలిసి ఓ ఫిర్యాదు అందజేశారు. తాను ఆర్మీ ఆసుపత్రి నుండి బయటకు రాగానే మళ్లీ అరెస్టు చేసేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ.. ప్రస్తుతం టీటీడీలో డిప్యూటేషన్ పై జేఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న రక్షణ శాఖ అధికారి ధర్మారెడ్డి ద్వారా ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపి రెడ్డితో మాట్లాడి కుట్రలు పన్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందజేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఏపీ సీఐడీ సీజ్ చేసిన తన సెల్ ఫోన్ నుండి ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయంటూ ఫిర్యాదు చేయడంతో పాటు ఏపీ సీఐడీకి తన ఐ ఫోన్ అప్పగించాలంటూ లీగల్ నోటీసు కూడా ఇచ్చారు. తన వద్ద నుండి తీసుకున్న ఐ పోన్ ను కోర్టుకు సమర్పించిన రికార్డులో చూపలేదని కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను వారు ఒక్కరొక్కరుగా తిప్పి కొడుతున్నారు.

MP RRR Case CID, TTD JEO Dharmareddy refuted the Raghurama allegations
MP RRR Case CID TTD JEO Dharmareddy refuted the Raghurama allegations

సీజ్ చేసిన రఘురామ ఐ ఫోన్ ను గుంటూరు సీఐడీ కోర్టుకు అప్పగించామని సీఐడీ తెలిపింది. సీజ్ చేసిన ఫోన్ నుండి ఎవరికీ మెసేజ్ లు వెళ్లే అవకాశమే లేదని స్పష్టం చేశారు. సీజ్ చేసిన సమయంలో తమకు వెళ్లడించిన సెల్ నెంబర్, ఢిల్లీలో పోలీసులకు ఇచ్చిన సెల్ నెంబర్ వేరువేరుగా ఉన్నాయని సీఐడి వెల్లడించింది. ఫోన్ డేటా విశ్లేషణ కోసం ల్యాబ్ కు పంపి విశ్లేషించిన డేటా వివరాలు కోర్టుకు సమర్పించినట్లు వివరించింది.  రఘురామ చేస్తున్నది తప్పుడు అభియోగాలని సీఐడీ పేర్కొంది.

Read More: Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కీలక వినతి ..! బాధితులకు షాకింగ్ న్యూస్ ఇదీ..!!

మరో పక్క టీటీడీ జేఇఓ ధర్మారెడ్డి కూడా రఘురామ ఆరోపణలపై స్పందించారు. తాను హైదరాబాద్ వెళ్లానని చెబుతున్న తేదీల్లో తిరుపతిలోనే ఉన్నానని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మే 3వ తేదీ నుండి 18వ తేదీ వరకూ తాను సుందరకాండ దీక్షలో ఉన్నాననీ, ఆ తరువాత కూడా తిరుమల విడిచి తాను వెళ్లలేదని పేర్కొన్నారు. ఒక వేళ తాను తిరుమల దాటి వెళ్లినట్లు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధమంటూ సవాల్ కూడా విసిరారు ధర్మారెడ్డి. ఆర్మీ ఆసుపత్రి అధికారి కేపి రెడ్డితో తనకు ఎలాంటి పరిచయం కూడా లేదని స్పష్టం చేస్తూ అవసరమైతే గత మూడేళ్ల తన ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా చూసుకోవచ్చని వెల్లడించారు. రఘురామ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రఘురామ ఆరోపణలు చేసిన తరువాత గుంటూరు రూరల్ ఎస్పీని ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడంతో టీటీడీ జేఈఓ  ధర్మారెడ్డి డిప్యుటేషన్ ను కేంద్ర రక్షణ శాఖ రద్దు చేసి రికాల్ చేయనున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ధర్మారెడ్డి స్వయంగా రఘురామ ఆరోపణ చేసిన ఆరోపణలను తీవ్రంగా  ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఈ ఖండనలపై రఘురామ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!