NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR Case: రఘురామ కేసులో కొత్త ట్విస్ట్‌లు ఇవీ..!!

MP RRR Case: రాజద్రోహం తదితర నేరారోపణతో ఏపి సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో కొత్తకొత్త ట్విస్ట్ లు వెలుగుచూస్తున్నాయి. రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు రఘురామ కృష్ణం రాజుకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ కృష్ణం రాజుకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఈ రోజు గుంటూరు ట్రయిల్ కోర్టులో రఘురామ న్యాయవాదులు  పూచికత్తులు సమర్పించి విడుదల చేయించుకోవాలని ప్రయత్నించారు. అయితే రఘురామ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక, డిశ్చార్జ్ సమ్మరి అందజేయాలని మేజిస్ట్రేట్ ఆర్మీ అధికారులను ఆదేశించారు. మరో నాలుగు రోజుల పాటు రఘురామకు చికిత్స అవసరం అని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు తెలిసింది. దీంతో రఘురామ విడుదల ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకురావాలని ఎస్కార్ట్ ను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.

MP RRR Case new twists
MP RRR Case new twists

దీనిపై రఘురామ కృష్ణం రాజు న్యాయవాది గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు దిక్కార నటీసులు పంపినట్లు తెలుస్తోంది. రఘురామ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే వెంటనే గుంటూరుకు తీసుకురావాలని ఎస్కార్ట్ ను ఆదేశించినట్లు సమాచారం అందిందని తెలిపారు.  సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం రఘురామ బెయిల్ పై విడుదల అయినట్లేననీ, విడుదలైన పది రోజులకు బాండ్లను కోర్టులో సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపడం కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లేనని ఆయన పేర్కొన్నారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి గుంటూరు అర్బన్ ఎస్పీకి దుర్గా ప్రసాద్ నోటీసులు పంపారు.

Read More: MP RRR Case: సుప్రీం నుండి బెయిల్ లభించినా ఇంకా ఆర్మీ అసుపత్రిలోనే  రఘురామ కృష్ణం రాజు..! విడుదలకు మరో నాలుగు రోజులు ..! ఎందుకంటే..?

మరో పక్క రఘురామ కృష్ణం రాజు ఆర్మీ ఆసుపత్రి కమాండర్ కు లేఖ రాశారు. పెయిన్ కిల్లర్స్,  యాంటీ బయాటిక్స్ వాడుతున్నా కాలి నొప్పి ఇంకా తగ్గలేదనీ, బీపీ కూడా ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. తన ఆరోగ్యం సరిగా లేదనీ, మరో రెండు మూడు రోజులు ఆసుపత్రిలోనే డాక్టర్ ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలని కోరారు. ఒక వేళ డిశ్చార్జ్ చేయాలని భావిస్తే డిశ్చార్జ్ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితి స్పష్టంగా పేర్కొనాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఏపికి చెందిన పోలీసులు కొందరు పోలీసులు ఆర్మీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు తెలుస్తోందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju