ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR Episode: రఘురామపై స్పీడ్ పెంచిన వైసీపీ..! పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తామంటూ స్పీకర్‌కు హెచ్చరిక..!!

Share

MP RRR Episode: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కంటిలో నలుసుగా మారి ఇబ్బందులకు గురి చేస్తున్న రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించే పట్టుదలతో పార్టీ పావులు కదుపుతోంది. అవసరమైతే పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేసేందుకు కూడా వైసీపీ సిద్దమవుతోంది. దాదాపు ఏడాది కాలంగా రఘురామ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామపై నర్సాపురం నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ లో వైసీపీ శ్రేణుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేయగా, ఆయన అరెస్టు కాకుండా హైకోర్టు నుండి ఉపశమనం పొందారు.  ఆ తరువాత జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా రఘురామ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ తరుణంలోనే ఏపి సీఐడీ రఘురామపై రాజద్రోహం  తదితర సెక్షన్ల కింద అరెస్టు చేసి జైలుకు పంపగా సుప్రీం కోర్టు నుండి బెయిల్ పొంది బయటకు వచ్చేశారు. ఆ తరువాత అయినా  రఘురామ సైలెంట్ గా ఉన్నారా అంటే అదీ లేదు. సుప్రీం కోర్టు సూచనల మేరకు మీడియా సమక్షంలో రచ్చబండ కార్యక్రమం అయితే నిర్వహించడం లేదు కానీ సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తూ వార్తల్లోనే నిలుస్తున్నారు.

MP RRR Episode: ycp mp vijayasai reddy serious comments on RRR issue
MP RRR Episode: ycp mp vijayasai reddy serious comments on RRR issue

Read More: Vijayamma: విజయమ్మ వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షపదవిలో ఉన్నట్టా..? లేనట్టా…? వైఎస్ఆర్ టీపీలో చేరిపోయారా..? తెలుగు ప్రజల్లో కన్ఫ్యూజన్..!!

ఈ నేపథ్యంలో తాజాగా రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపిలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామ కృష్ణం రాజు అనర్హత పిటిషన్ ను మరిన్ని ఆధారాలతో అందజేశారు. ఇంతకు ముందు ఇచ్చిన పిటీషన్ లపై స్పీకర్ చర్యలు తీసుకోని కారణంగా మరి కొన్ని బలమైన అధారాలతో మరో పిటిషన్ ను అందజేశారు. ఇప్పటికీ స్పీకర్ రఘురామపై అనర్హత వేటు వేయకపోతే పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయిం తీసుకున్నది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి తెలియజేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకూ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటునకు డిమాండ్ చేస్తూ ఈ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ప్రకటించారు విజయసాయిరెడ్డి.

MP RRR Episode: స్పీకర్ పైనా ఆరోపణలు

విజయసాయి రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపైనా ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అనర్హత వేటు విషయంలో స్పీకర్ ఆలస్యం చేయకూడదన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు విషయంలో ఏడాది నుండి స్పీకర్ చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆయన వైఖరి పక్షపాతంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.


Share

Related posts

Samantha : అనుష్క, సమంత టాలీవుడ్ కి దూరమవడానికి కారణమదేనా??

Naina

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

somaraju sharma

Pawan kalyan: తగ్గేదేలే నా థియేటర్స్ తీసుకో..పవన్‌తో సురేశ్ బాబు..?

GRK