NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR letter to CM YS Jagan: రఘురామ లేఖాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో..? వరుసగా మూడో రోజు సీఎం జగన్ కు లేఖ..!!

MP RRR letter to CM YS Jagan: రఘురామ కృష్ణం రాజును పార్లమెంట్ నుండి బయటకు పంపి ఇరుకున పెట్టాలని వైసీపీ, వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఇరుకున పెట్టాలని రఘురామ చేస్తున్న ప్రయత్నాలు ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారుతున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా రఘురామ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గతంలోనే వైసీపీ పార్లమెంటరీ నేతలు లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాకు లేఖ అందించిన విషయం తెలిసిందే. మరో సారి తాజాగా వైసీపీ లోక్ సభ విప్ మార్గాని భరత్ మరో సారి స్పీకర్ ను కలిసి ఆ ఫిర్యాదు విషయాన్ని గుర్తు చేస్తూ మరో వినతి పత్రాన్ని అందించారు.

MP RRR letter to CM YS Jagan
MP RRR letter to CM YS Jagan

ఇదిలా ఉంటే సుప్రీం ఆదేశాల నేపథ్యంలో రచ్చ బండ కార్యక్రమం నిర్వహించడం కుదరకపోవడంతో రఘురామ గత మూడు రోజులుగా సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కొక్క హామీని గుర్తు చేస్తూ రోజుకో లేఖ జగన్ కు రాస్తున్నారు రఘురామ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90 శాతం పైగా నెరవేర్చామని సీఎం వైఎస్ జగన్ తో సహా మంత్రులు, వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తుండగా, అమలుకాని హామీలను రఘురామ ఎత్తి చూపుతున్నారు. వృద్ధాప్య ఫించన్ల విషయంతో పాటు సీపీఎస్ విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ రఘురామ ఇప్పటికే రెండ లేఖలు రాయగా, తాజాగా పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల విషయాన్ని గుర్తు చేస్తూ మూడో లేఖ రాశారు.

Read More: Sajjala Ramakrishna Reddy: టీడీపీ విమర్శలపై ఘాటుగా సమాధానమిచ్చిన సజ్జల

ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పెళ్లి కానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికల ముందు చెప్పిందన్నారు. ఈ సాయాన్ని కూడా లక్షకు పెంచుతామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ హామీతో ప్రజల నుండి వైసీపీకి మద్దతు లభించిందనీ, ఇప్పుడు ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని అన్నారు రఘురామ. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్చారు. ఆర్థిక సహయాన్ని పెంపుదల చేస్తూ జివో కూడా విడుదల చేశారు. కానీ ఎన్నికల ముందు నుండి ఇప్పటి వరకూ జరిగిన వివాహాలకు సంబంధించి ఒక్కరికీ ప్రభుత్వం నుండి సాయం అందలేదు. కాగా మూడు రోజులుగా రఘురామ వరుస లేఖలు రాస్తుండటంతో ఇలా ఇంకా ఎన్ని హామీలకు సంబంధించి లేఖలు రాయనున్నారో అని చర్చించుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju