MP RRR Letter to ap cm Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు రెబల్ ఎంపి రఘురామ లేఖ..ఏమి రాశారంటే..

Share

MP RRR Letter to ap cm Jagan: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వైఎస్ జగన్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత ఒక పక్క కేంద్ర మంత్రులను కలవడం, మరో పక్క లోక్ సభ స్పీకర్ ను కలిసి తనపై కేసు, అరెస్టు తదనంతర పరిణామాలు వివరించారు. సహచర లోక్ సభ సభ్యులకు, ఏపి మినహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజద్రోహం సెక్షన్ పై లేఖలు రాశారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ కు లేఖలు రాశారు. అయితే ఇప్పుడు తాజాగా ఏపి సీఎం వైఎస్ జగన్ కు ఓ ఎన్నికల హామీని గుర్తు చేస్తూ లేఖ రాశారు.

MP RRR wrote Letter to ap cm Jagan
MP RRR wrote Letter to ap cm Jagan

Read More: Corona cricis: టీ స్టాల్ నడుపుకునే వ్యక్తి ప్రధాని మోడీకి డబ్బిచ్చాడు..! ఎందుకో తెలుసా..!?

వృద్ధాప్య ఫించన్ ను రూ.2 వేల నుండి రూ.3 వేలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘురామ కృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఏటా రూ.250లు పెంచుకుంటూ ఫించన్ ను మూడు వేలకు పెంచుతామని తెలియజేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఏర్పడి రెండేళ్లు దాటి మూడో ఏడులోకి ప్రవేశించిందన్నారు. ఈ నెల నుండి ఫించన్ ను రూ.2,750లు పెంచి ఇవ్వాలని కోరుతూ. ఏడాదిగా పెండింగ్ ఉన్న పించన్ల నగదు కూడా కలిపి రూ.3వేలు చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫించన్ ను రూ.3వేలకు పెంచుతామని అప్పట్లో హామీ ఇవ్వడం వల్ల ప్రజలు వైసీపీకి పూర్తి లభించిందని పేర్కొన్నారు.  ఫించన్లు అందక వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ రఘురామ సీఎం జగన్ కు ఈ లేఖ రాశారు.

ఇటీవల  పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపుపైనా కేంద్రానికి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.


Share

Related posts

‘ మీరందరూ ఆగండి, నేను దిగుతున్నా ‘ అత్యవసరంగా రంగంలోకి కే‌సి‌ఆర్..!!

sekhar

ఆంధ్రప్రదేశ్ ఏసీపీ హీరో రామ్ కిచ్చిన షాక్ మామూలుగా లేదు!

Yandamuri

పార్టీతో పోరాటంలో ఆ ఎంపీదే పై చేయా..?

somaraju sharma