MP Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ లో భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లు పెరిగాయి. చిత్ర నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేయడం లేదు. దీంతో ఏపిలో షూటింగ్ లు పెరుగుతున్నాయి. ఏపిలో భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లు ఇటీవల పెరిగిపోయాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇది సంతోషించదగ్గ పరిణామం అని ఆయన పేర్కొన్నారు.

ఏపిలో పెద్ద సినిమాల చిత్రీకరణలు పెరగడానికి సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాలే కారణమని వెల్లడించారు. అధిక ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో షూటింగ్ లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని విజయసాయి రెడ్డి కొనియాడారు. సినిమా షూటింగ్ ల్లో పెద్ద సంఖ్యలో కార్మికుల అవసరం ఉంటుందని, వందల సంఖ్యలో ప్రజల ఉపాధి కలుగుతుందని విజయసాయి వివరించారు. ముఖ్యంగా, స్థానికులకు లబ్ది చేకూరుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు.
అదే విధంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన వాగ్దానాలను నిలబెట్టుకోవడం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆ క్రమంలోనే వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత కింద మహిళా గ్రూపులకు రూ.6,419 కోట్లను విడుదల చేశారని తెలిపారు.
MLA Sridevi: ‘జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది’
Happy to note that there is a spike in big-budget Movie shootings in AP due to HCM @ysjagan garu’s decision to allow shooting without charging an exorbitant fee. Movie shootings are very labour intensive and employ hundreds of people, benefitting the locals.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 26, 2023