NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి కేంద్రానికి కీలక సూచన .. అది ఏమిటంటే..?

MP Vijayasai Reddy: రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రెయిన్‌ నుంచి వేలాది మంది వైద్య విద్యార్ధులు భారతదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్ధుల తరలింపు ప్రక్రియను పూర్తి చేసింది. అయితే భారత్ కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో వీరికి దేశీయ వైద్య విద్యా సంస్థల్లో  ప్రవేశం కల్పించి చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టి  ఆదుకోవాలని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

MP Vijayasai Reddy referring problem of medical students from Ukraine
MP Vijayasai Reddy referring problem of medical students from Ukraine

 

Read More: CM YS Jagan: సీఎం జగన్ నోట మంత్రివర్గ విస్తరణ మాట..? కేబినెట్‌ లో హాట్ డిస్కషన్..!!

MP Vijayasai Reddy: వైద్య విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు

రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడ వివిధ విశ్వ విద్యాలయాల్లో వైద్య విద్యను అభ్యసిస్తూ చిక్కుబడిపోయిన వేలాది మంది భారతీయ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను విజయసాయి ఈ సందర్భంగా అభినందించారు. అయితే ఇప్పుడు అర్థాంతరంగా నిలిచిపోయిన తమ చదువులపై వారు ఆందోళన చెందుతున్నారని విజయసాయి చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశాలు కనిపించడం లేదన్నారు.

ప్రత్యేక కేటగిరీగా పరిగణించి…

ఇలాంటి అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మానవతాధృక్పదంతో, అరుదైన కేసుగా పరిగణించి ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన మెడికల్‌ విద్యార్ధులు దేశీయ యూనివర్శిటీలలో తమ చదువును కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు. ప్రస్తుతం దేశంలో ఏదైనా మెడికల్‌ కళాశాల మూతబడిన పక్షంలో విద్యార్ధులను వివిధ మెడికల్‌ కళాశాల్లో సర్దుబాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉక్రెయన్‌ నుంచి తిరిగి వచ్చిన మెడికల్‌ విద్యార్ధుల విషయంలో కూడా అలాంటి ప్రత్యేక బదిలీ విధానాన్ని రూపొందించాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!