NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా .. హైకోర్టులో వాడివేడిగా వాదనలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో మారు రేపు సీబీఐ విచారణను ఎదుర్కొనున్నారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయిదవ సారి విచారణకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయగా అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణను వాయిదా వేసింది. నిన్న సీబీఐ విచారణ అవినాష్ రెడ్డి హజరు కాలేదు. దీంతో ఈ వేళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణ చేస్తామని సీబీఐ తెలిపింది. అయితే నిన్న, ఇవేళ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు వాడివేడిగా జరిగాయి. ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ys Viveka Murder Case Telangana High court

 

ఈ కేసులోని వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవేళ సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవేళ సాయంత్రం వరకూ వాద ప్రతివాదనలు జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆయనకు సమాచారం ఇచ్చారు. రాజకీయ కారణాలతోనే భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డిలను ఈ కేసులో ఇరికిస్తున్నారనీ, వివేకా హత్యతో వీరికి ఎటువంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలు వినిపించారు. వివేకా హత్య జరగడానికి నాలుగు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కుటుంబ వివాదాలు, ఆర్ధిక వివాదాలు, అక్రమ సంబంధాలు ఇలా నాలుగైదు కోణాలు ఉన్నాయనీ, సీబీఐ ఆ దిశగా దర్యాప్తు చేయడం లేదని అన్నారు. అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలను సీబీఐ తరపు న్యాయవాది తోసిపుచ్చుతూ విచారణ సక్రమంగా జరుగుతోందనీ, కోర్టులను ఆశ్రయిస్తూ దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారనీ, విచారణకు సహకరించడం లేదని తెలిపారు. అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కూడా సీబీఐ తెలిపింది. దీంతో కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది. రేపటి విచారణకు అవినాష్ రెడ్డి హజరు అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అవినాష్ రెడ్డి న్యాయవాది, సునీత తరపు న్యాయవాది మధ్య కోర్టులో వాగ్వివాదం జరిగినట్లుగా వాార్తలు వెలువడ్డాయి.

చిన్నారిపై లైంగిక దాడి ఘటన కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!