మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలకు సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి నేడు స్పందించారు. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వేంపల్లిలో సోమవారం జరిగిన వలంటీర్లు, గృహ సారధుల సమావేశంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణకు 10వ తేదీ హజరవుతానని చెప్పారు. తన తండ్రి భాస్కరరెడ్డి 12వ తేదీన కడపలో విచారణకు హజరవుతారని వెల్లడించారు. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వ్యాఖ్యానించారు అవినాష్ రెడ్డి,

వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మొన్న సీబీఐ అధికారులు మరో సారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో ఆరవ తేదీ విచారణకు హజరు కాలేనంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీంతో నిన్న రాత్రి పులివెందుల లోని అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే 12వ తేదీన కడపలో విచారణకు హజరు కావాలని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి నోటీసులు అందించారు. అయితే ఈ సారి విచారణకు కచ్చితంగా హజరుకావాలని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

అవినాష్ రెడ్డిని ఇప్పటికే రెండు పర్యాయాలు సీబీఐ అధికారులు విచారణ చేశారు. మొదటి సారి విచారణ సందర్భంలో మరో సారి విచారణ రావాల్సి ఉంటుందని చెప్పిన సీబీఐ అధికారులు, రెండవ సారి విచారణ సమయంలో మరో సారి రావాల్సి ఉంటుందని తెలుపలేదు. ఆ సమయంలో సీబీఐ అధికారుల దర్యాప్తు తీరుపై అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మూడో సారి విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయ్యింది.
వివేకా హత్య జరిగిన విషయం ఉదయం ఆరు గంటలకు అందరికీ తెలియగా, అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డికి అంతకు ముందే తెలుసునని సీబీఐ భావిస్తొంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచివేయడం, మృతదేహానికి కట్టుకట్టి ఆసుపత్రికి తరలించడం, గుండె పోటుగా ప్రచారం చేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తున్నది. వివేకా హత్య జరిగిన ముందు రోజు మార్చి 14వ తేదీ సాయంత్రం నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ పావు గంట పాటు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని గుగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐకి అధారాలు లభించాయి. దీంతో వివేకా హత్య కేసులో వీరి కుట్ర ఉండవచ్చని సీబీఐ అనుమానిస్తున్నది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్