NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకాకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించిన ఎంపీ అవినాష్ రెడ్డి

Share

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. ముచ్చటగా మూడో సారి సీబీఐ అధికారుల ముందు హజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మూడవ సారి విచారణకు ఒక రోజు ముందు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు హజరు అవుతారా లేదా అనే సస్పెన్ష్ నెలకొనగా, ఆ సస్పెన్స్ కు తెరదించుతూ శుక్రవారం సీబీఐ అధికారుల ముందు వెళ్లారు అవినాష్ రెడ్డి. ఒక పక్క హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ, మరో పక్క సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణ జరిగాయి. ఇవేళ విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ఊహగానాలు వచ్చినప్పటికీ హైకోర్టు సోమవారం వరకూ అరెస్టు చేయవద్దు అంటూ ఆదేశించిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోలేదు. సీబీఐ కార్యాలయంలో దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో మరో సారి సీబీఐ దర్యాప్తు తీరుపై సంచలన కామెంట్స్ చేశారు.

MP Avinash Reddy

 

రెండు సార్లు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అడిగినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కేసులో సీబీఐ విచారణ తప్పుదారి పడుతోందని అన్నారు. తప్పుడు సాక్షాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అవినాష్ రెడ్డి. తన కోసం వివేకా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నిర్వహించారని, కట్టుకథను అడ్డు పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మౌనంగా భవిస్తూ వచ్చాననీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. విచారణ సమయంలో ఒక ల్యాప్ టాప్ మాత్రమే పెడుతున్నారనీ, ల్యాప్ టాప్ లో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తనకు తెలియదన్నారు. సీబీఐ వాళ్లే తన సోదరి (వివేకా కుమార్తె) కు సమాచారం ఇస్తున్నారని, కోర్టులను కూడా తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. తాను హైకోర్టులో లంచ్ మోష్ వేసిన వెంటనే ఆమె (సునీత)కు సీబీఐ సమాచారం ఇచ్చిందనీ, దీని వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయని ఆరోపించారు.

వాస్తవానికి వివేకా కుటుంబంలో ఆస్తి గొడవలు ఉన్నాయని చెప్పారు అవినాష్ రెడ్డి. ఆస్తి తగాదాల కోసమే వివేకా హత్య జరిగినట్లు తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. వివేకాకు 2006 నుండి ఒక మహిళతో సంబంధం ఉందనీ, 2011 లో ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం ఆ మహిళను వివాహం కూడా చేసుకున్నారనీ, ఆ సమయంలో వివేకా తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారనే కొత్త విషయాన్ని వెల్లడించారు అవినాష్ రెడ్డి. యం ప్రకారం షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకుని ఆమెను వివాహం కూడా చేసుకున్నారని తెలిపారు. వారికి షేక్ షహన్ షా అనే అబ్బాయి కూడా ఉన్నారని చెప్పారు. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో డాక్యుమెంట్ల కొందరు గాలించారన్నారు. ఆస్తి తగాదాల కోసమే వివేకా హత్య జరిగినట్లుగా తాను భావిస్తున్నానన్నారు. ఈ కేసులో సీబీఐ అన్ని కట్టుకథలు అల్లుతోందని, హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖను మధ్యాహ్నం వరకు సునీత భర్త ఎవరికీ ఇవ్వలేదన్నారు. తాను ఎవరికీ గుండెపోటు అని చెప్పలేదని ఇది అప్పటి టీడీపీ ప్రభుత్వం సృష్టించిన కట్టుకథ అని అన్నారు. తానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. రాజకీయ కుట్రలను తప్పకుండా చేదిస్తామని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

మహా అయితే అరెస్టు చేస్తారు .. కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదన్న సీఎం కేసిఆర్


Share

Related posts

Samantha – Nayanatara: సమంత, నయనతారలలో ఎవరు బెస్ట్ ..ఈ దెబ్బతో తేలిపోతుంది..

GRK

బ్రేకింగ్:టీడీపీకి గుడ్ బై చెప్పిన గద్దె బాబురావు

Special Bureau

Business:ఇంటి దగ్గర నుండి సంపాదించడం కుదరదు అనుకుంటున్నారా.. ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి వెంటనే మొదలు పెట్టండి

bharani jella