MPTC,ZPTC Elections : ఏపిలో కొనసాగుతున్న పరిషత్ పోలింగ్

Share

MPTC,ZPTC Elections : ఏపిలో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్ర్రక్రియ ప్రారంభం అయ్యింది.  రాష్ట్రంలో మొత్తం 660 జడ్‌పీటీసీ స్థానాల్లో 8 చోట్ల కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు.  మిగిలిన  652 జడ్‌పీటీసీ స్థానాల్లో  ఎన్నికలకు  నోటిఫికేషన్‌  జారీ కాగా అందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో  ఉన్న అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 515 జడ్‌పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 2,058 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

MPTC,ZPTC Elections poling Updates
MPTC,ZPTC Elections poling Updates

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా..  కోర్టు కేసులు, తదితర కారణాల వల్ల 375 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 9,672 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థుల మృతి కారణంగా 81 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. 18,782  మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఉదయం ఉండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగియనున్నది. ఏజన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటలకే పోలింగ్ నిలిపివేసి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించనున్నారు.

MPTC,ZPTC Elections poling Updates
MPTC,ZPTC Elections poling Updates

పోలింగ్ జరుగుతున్న తీరును తాడేపల్లి లోని పంచాయతీ రాజ్ కమిషనరేట్ కార్యాలయం నుండి వెబ్ కాస్టింగ్ విధానంలో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అత్యంత సున్నితమైన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.


Share

Related posts

జగన్ విమానం ఎక్కితే చాలు బిత్తరపోతున్న టిడిపి..!!

sekhar

జ‌గ‌న్ చుట్టూ కుట్ర…. హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయం?

sridhar

Modi : మోడీ ఏమ‌నుకుంటారో ఆలోచించ‌వా జ‌గ‌న్‌?

sridhar