NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ .. కీలక వ్యాఖ్యలతో..

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా మాట్లాడుతున్న వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ రాసినందుకు ఎక్కడ లేని కోపం రావచ్చనీ, రాష్ట్రంలో మీకు ఉన్న కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుద ముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చు అయనా నిజాన్ని నిర్బయంగా రాయాలనిపించి రాయకతప్పలేదని పేర్కొన్నారు ముద్రగడ. తాను కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడిగా ఎదగలేదన్నారు.

Mudragada

ఎప్పుడూ ఓటమి ఎరగని నేను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యానని, దీన్ని బట్టే నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహనరెడ్డి జగ్గంపేట సభలో రిజర్వేషన్ల అంశం నా చేతిలో ఉండదు, కేంద్రం పరిధి అని అన్నప్పుడు తాను ఏమని లేఖ రాశానో అడిగి తెలుసుకోమని అన్నారు. నేను కోట్లాది రూపాయలు సూట్ కేసులకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదన్నారు. నా కంటే చాలా బలవంతులైన మీరు (పవన్ కళ్యాణ్) నేను వదిలివేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని తిట్టడానికి విలువైన సమయాన్ని వృధా చేయవద్దని ముద్రగడ హితవు పలికారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకం నుండి కాపాడటం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తదితర సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ప్రయత్నం చేయమని 2019 ఎన్నికలకు ముందు మీరు నా  వద్దకు పంపిన రాయబారులకు సలహా ఇస్తే ఆ సలహాలను గాలికి వదిలివేశారని విమర్శించారు. నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్దం చేయమని సూచించారు. నాలాంటి అనాధల మీద విమర్శలు ఆపి పైన తెలిపిన వాటిపై కార్యాచరణ తయారు చేసుకుని రోడ్డు ఎక్కండని అన్నారు ముద్రగడ.

పార్టీ పెట్టిన తర్వాత పది మంది చేత ప్రేమించబడాలి కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మీకు రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో గానీ మీరు మాట్లాడే భాష ఒక పార్టీ అధినేతగా మాట్లాడవలసినది కాదని అన్నారు. దీని వల్ల నష్టం తప్ప లాభం ఎంత మాత్రం ఉండదని అన్నారు. తొక్క తీస్తా, నార తీస్తా, కింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంత మందికి తీయించి కింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంత మందికి చేయించారో, ఎంత మందిని చెప్పుతో కొట్టారో సెలవు ఇవ్వాలన్నారు. చంద్రశేఖరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి, వారి తాత కృష్ణారెడ్డి లు తప్పుడు మార్గాలలో సంపాదన అని అనే మాట చాలా తప్పు అని, వారి కుటుంబంతో నాకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందన్నారు.

కాపు ఉద్యమానికి వారు సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు.  కాపుల ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదన్నారు. కాపులు తరుపున చేసిన ఉద్యమాలకు మీరెందుకు రాలేదని నేనేమీ ప్రశ్నించదల్చుకోలేదన్నారు. కానీ తరచూ మీ ఉపన్యాసాలలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. మీ సత్తా చూపడానికి రేపు జరగబోయే ఎన్నికల్లో కాకినాడలో చంద్రశేఖరరెడ్డిపై పోటీ చేయాలన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని తరచు అంటున్నప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎలా అడుగుతున్నారో అర్ధం కాని ప్రశ్నగా ఉందని అన్నారు ముద్రగడ.

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద స్వామి అరెస్టు


Share

Related posts

Son Of India: సన్ ఆఫ్ ఇండియా సాంగ్ విడుదల.. అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు..!!

bharani jella

Singer Mangli : ఎక్స్ ట్రా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్ మంగ్లీ

Varun G

‘ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి లక్ష సాయం’

somaraju sharma