Chandra Babu: చంద్రబాబుకు ముద్రగడ ఘాటు లేక ..!  మీ పతనం నాకళ్లతో చూడాలనే బతికున్నా అంటూ సీరియర్ కామెంట్స్…!!

Share

Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో సారి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాధం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమానికి, రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం నేడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తనకు జరిగిన అన్యాయాన్ని మరో సారి ఎలుగెత్తి చాటుతూ లేఖ రాశారు. “ మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఇంకా బ్రతికి ఉన్నాను” అన్న ఘాటైన పదాలను లేఖలో ప్రయోగించారు ముద్రగడ. ముద్రగడ ఇప్పుడు చంద్రబాబుకు బహిరంగ లేఖ ఎందుకు విడుదల చేశారు అంటే.. చంద్రబాబు ఆయన సతీమణికి జరిగిన అవమానం గురించి చాలా బాధపడుతూ ఆవేదనతో వెక్కివెక్కి కన్నీరు కార్చడం టీవీలో చూసి ఆశ్చర్యపోయారట. అందుకే బహిరంగ లేఖ రాశారు.

Mudragada padmanabham serious comments on Chandra Babu
Mudragada padmanabham serious comments on Chandra Babu

Chandra Babu:  శపథాలు చేయకండి అవి నీటి మీద రాతలు అవుతాయి

శపథాలు చేయకండి..అవి మీకు నీటి మీద రాతలని చంద్రబాబు గ్రహించాలన్నారు ముద్రగడ.  గతంలో 14 రోజుల పాటు తన కుటుంబానికి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ రోజు మీ ప్రత్యర్ధి జగన్మోహనరెడ్డి అయితే తనపై కట్టలుతెంచుకునే కోపాన్ని, క్రూరత్వాన్ని ఎందుకు చూపారని చంద్రబాబును ప్రశ్నించారు ముద్రగడ. ఆనాడు అణచివేతతో తమ కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది తమ ప్రయత్నం కాదా అని ప్రశ్నించారు. ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేసినప్పటికీ నా కుటుంబాన్ని అవమాన పర్చిన మీ (చంద్రబాబు) పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతో ఆత్మహత్య ప్రతయత్నం విరమించుకున్నానని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

 

టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ లు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టిన ముద్రగడ .. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ ఊసే ఎత్తడం లేదు,  కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ సీఎం జగన్ అసెంబ్లీలో విస్పష్టంగా చెప్పినా ఆయన ఈ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. వీటిని బట్టి చూస్తేనే ముద్రగడ వైసీపీకి అనుకూలమని స్పష్టం అవుతుందని టీడీపీ నేతలు పెర్కొన్నారు. ఈ లేఖ వెనుక కూడా వైసీపీ హస్తం ఉందని టీడీపీ వర్గీయులు అనుమానిస్తున్నారు. వివిధ వర్గాల నుండి చంద్రబాబుకు వస్తున్న సానుభూతి చూసి వైసీపీ.. ముద్రగడతో లేఖాస్త్రం సంధింపజేశారన్నది టీడీపీ వాళ్ల భావన.

 

ముద్రగడ లేఖ పూర్తి పాఠం ఇదీ..  


Share

Related posts

Big Breaking : తిరుపతి అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ

somaraju sharma

ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణస్వీకారం

Mahesh

Shriya Saran Gorgeous Photos

Gallery Desk