25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అందరిలా జగన్ ఉండకూడదని ఆకాంక్షించిన ముద్రగడ .. రిజర్వేషన్లపై మరో లేఖ

Share

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో సారి కాపు రిజర్వేషన్ల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఇంతకు ముందు కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ లేఖ రాసిన ముద్రగడ..తాజాగా మరో లేఖ రాస్తూ కొన్ని విషయాలను ప్రస్తావించారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్ల పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు ఉండాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు ఈ సామాజికవర్గాన్ని ఉపయోగించుకున్నారనీ, అందరిలా జగన్ ఉండకూడదని ముద్రగడ అకాంక్షించారు.

mudragada wrote letter to cm ys jagan on Kapu Reservation issue

 

గతంలో అసెంబ్లీలో వీరి (కాపుల) కోరిక సమంజసం, న్యాయం అని తమరు (జగన్) అన్నారని విన్నాననీ, కాపు నాయకులన్నా జగన్ చాలా మంచిగా మద్దతు ఇస్తూ మాట్లాడారని చెప్పుకున్నారని ముద్రగడ పేర్కొన్నారు. కాపు, ఒంటరి, తెలగ, బలిజ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే వారు జీవితాంతం మీకు (జగన్) రుణపడి ఉంటారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నకు.. కాపు రిజర్వేషన్లపై చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని ఆయన తెలిపారు.

ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన చట్టం చట్టబద్ధమేనని ఆయన పేర్కొనడంతో మరో సారి కాపులకు రిజర్వేషన్ అంశం మరో సారి తెరపైకి వచ్చింది. కేంద్ర మంత్రి ప్రకటన తర్వాత రిజర్వేషన్లపై ఒక లేఖ రాసిన ముద్రగడ.. తాజాగా మరో సారి సీఎంకు లేఖ రాశారు. ఈ అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

Jana Sena : కీలకమైన జిల్లాలో టీడీపీ ని పక్కనపెట్టేసింది..నెంబర్ టు లోకి జనసేన!!

sekhar

Badvel By Election Results 2021: బద్వేల్‌లో భారీ మెజార్టీతో వైసీపీ విజయం ..! బీజేపి డక్ అవుట్..!!

somaraju sharma

జగన్ కి షాక్ ఇచ్చిన మరొక ఎంపీ .. రఘురామ కంటే పెద్ద షాక్ ఇది ? 

sekhar