NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Municipal Election Results: నెల్లూరులో వైసీపీ స్వీప్.. ! కొండపల్లిలో బిగ్ ట్విస్ట్..! అది ఏమిటంటే..?

Municipal Election Results: నెల్లూరు కార్పోరేషన్‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 54 డివిజన్లకు గానూ 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించి రికార్డు సృష్టించారు. అదే విధంగా కుప్పంతో సహా 9 మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకుంది.  వైసీపీ ప్రభంజం ఈ విధంగా కొనసాగుతున్న క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో అనూహ్యంగా టీడీపీ గెలుపొందింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుండగా, కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎంపికకు స్వతంత్ర అభ్యర్ధి కీలకం అయ్యారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమాన స్థాయిలో వార్డులు వచ్చాయి.

Municipal Election Results updates
Municipal Election Results updates

Read More: AP High Court: అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..!!

Municipal Election Results: కొండపల్లిలో వైసీపీ 14 – టీడీపీకి 14 వార్డులు

కొండపల్లి మున్సిపాలిటీలో 29 వార్డులకు గానూ టీడీపీ 14, వైసీపీ 14 గెలుచుకోగా ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్ధి విజయం సాధించారు. జనసేన, బీజేపీ, వామపక్షాల అభ్యర్ధులు పోటీ చేసినా ఎక్కడా గెలవలేదు. ప్రధాన పార్టీలకు సమాన స్థానాలు రావడంతో కొండపల్లిలో స్వతంత్ర అభ్యర్ధి కీలకం అయ్యాయి. చైర్మన్ ఎంపికకు ఈ ఇండిపెండెంట్ అభ్యర్ధి చాలా కీలకంగా మారిపోయాడు.  సదరు ఇండిపెండెంట్ అభ్యర్ధి అధికార వైసీపీకి మద్దతు ఇస్తాడా, లేక ప్రతిపక్ష టీడీపీకి మద్దతు పలుకుతాడా అనేది సర్వత్రా ఆసక్తినెలకొంది. ఆ స్వతంత్ర అభ్యర్ధి ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీకే చైర్మన్ తో సహా రెండు వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉంది. మైలవరం నియోజకవర్గంలోని ఇంబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలను కలిసి కొండపల్లి  మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికను వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju