Murder; విజయవాడ గొల్లపూడిలో హోంగార్డు వినోద్ భార్య మృతికి గన్ మిస్ ఫైర్ కావడం కాదని పోలీసుల విచారణలో తెలిసింది. సీఎం సెక్యురిటీ వింగ్ ఎఎస్పీ శశికాంత్ వద్ద అసిస్టెంట్ గా పని చేసే వినోద్ వద్ద గల గన్ భార్యకు చూపుతుండగా మిస్ ఫైర్ అవ్వడం వల్ల ఆమె మృతి చెందిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే వినోద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి.
వినోద్ ఉద్దేశపూర్వకంగానే భార్య సూర్య రత్నప్రభను గన్ తో కాల్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నగల విషయంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వినోద్ భార్యను రివాల్వర్ తో కాల్చి చంపినట్లు విచారణ తెలిపాడు. వినోద్ గత మూడు రోజులుగా నైట్ డ్యూటీ చేస్తున్నాడనీ, ఎఎస్పీ శశికాంత్ తన గన్ ను కారులో వదిలివెళ్లడంతో ఆయన అసిస్టెంట్ గా పని చేస్తున్న హోంగార్డు వినోద్ గన్ ను తన వెంట జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లాడని సమాచారం. అయితే ఇంటికి వెళ్లిన తరువాత భార్య భర్తల మద్య గొడవ జరగడంతో గన్ తో తన భార్య సూర్యరత్న ప్రభను కాల్చి చంపాడని పోలీసులు వెల్లడించారు. కేసు నుండి తప్పించుకోవడానికి వినోద్ ముందుగా గన్ మిస్ ఫైర్ అంటూ కట్టుకథ అల్లాడని తెలుస్తోంది.