MAA: ‘మా’పై నాగబాబు హాట్ కామెంట్స్..! సినీ వర్గాల్లో చర్చ..!!

Share

MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై 106 అధిక్యతతో మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ఓటమిని నాగబాబు జీర్ణించుకోలేకపోయారు. ఫలితాలు వెల్లడైన కొద్దిసేపటికే ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన మా సభ్యత్వానికి రాజీనామా లేఖను నిన్న అసోసియేషన్ కు నాగబాబు పంపించారు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంలోనూ మా అసోసియేషన్ సభ్యులపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

nagababu sensational comments on MAA
nagababu sensational comments on MAA

Read More: Manchu Mohanbabu Vishnu: తండ్రీ తనయుల షాకింగ్ కామెంట్స్..!!

MAA: ఎన్నికలు కనువిప్పు కల్గించాయి

నిష్పక్షపాతం, విభిన్నత కల్గిన మా తీరును తాను ఎల్లప్పుడూ అభిమానించే వాడినని అన్నారు. సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని అసోసియేషన్ ఓ సొంతిల్లుగా నిలిచేదని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మా అసోసియేషన్ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా ఊహించని మార్పులు వచ్చాయని నాగబాబు అన్నారు. ఈ అసహ్యకరమైన మార్పులే తనను ఆశ్చర్యానికి గురి చేశాయని పేర్కొన్నారు. తనలాంటి వారికి ఎన్నికలు కనువిప్పు కలిగించాయని అన్నారు నాగబాబు. బలగం, ధన ప్రభావంతో మా సభ్యులు దారుణంగా దిగజారిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ..అలాంటి వారి వల్ల తాను మా అసోసియేషన్ కు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి వెంటే తాను ఎల్లప్పుడూ నిలబడి ఉంటానని తెలిపారు. మా భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నానని నాగబాబు పేర్కొన్నారు.

Read More: CM YS Jagan: తిరుమల నుండి తిరుగు ప్రయాణమైన సీఎం వైఎస్ జగన్..! మళ్లీ అదే వివాదం..!!

రాజీనామాలు దేనికి సంకేతం

మా అసోసియేషన్ కు నాగబాబు తరువాత ప్రకాశ్ రాజ్ కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే వీరి రాజీనామాలను ఆమోదించనని నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మంచు విష్ణు అన్నారు. దీనిపై వారితో స్వయంగా మాట్లాడతానని అన్నారు. అయితే మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాతో సహా మరి కొందరు రాజీనామా బాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగబాబు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం మాలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నటులు ఆందోళన చెందుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే బాగుండేదని సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు, కార్మికులు, ఆర్టీసీ ఎంప్లాయిస్, ఇలా అన్ని సంఘాల్లో రెండు మూడు యూనియన్లు ఉండగా ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమ కళాకారులకు సంబంధించి మా అసోసియేషన్ ఒక్కటే ఉంది. మా అసోసియేషన్ లో తెలంగాణ, ఏపితో పాటు వివిధ ప్రాంతాల సినీ కళాకారులు సభ్యులుగా ఉన్నారు. రాజీనామాల పర్వం కొనసాగితే మా అసోసియేషన్ చీలిక వచ్చి మరో అసోసియేషన్ పురుడు పోసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. చూడాలి ఏమి జరగుతుందో.


Share

Related posts

నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. సబ్ స్క్రిప్షన్ ఫ్రీ.. అయితే..!

Muraliak

కరోనాకి అంతం ఎప్పుడు..! కరోనా లాబ్ లో నుంచి లీక్ అయిందా ..?

Siva Prasad

నా ల‌వ‌ర్ క్రికెట‌ర్ కాదు: తాప్సీ

Siva Prasad