NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Nagarjuna Sagar dam row: సాగర్ జల వివాదం ..తెలంగాణ పోలీసులపైనా ఏపీలో కేసు నమోదు

Nagarjuna Sagar dam row: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నీటి విడుదల సందర్బంగా ఏర్పడిన ఘటనను పురస్కరించుకుని ఏపీ పోలీసులు, జలవనరుల శాఖ అధికారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయగా, తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసులు నమోదు చేశారు. ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. 29వ తేదీ రాత్రి సమయంలో ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు భారీ పోలీసు బలగాలతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు వెళ్లి 13వ గేటు వద్ద కంచె ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీలో తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేశారు.

ఈ సందర్భంలో తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో తమపై దాడి చేసి సాగర్ డ్యామ్ పైకి అక్రమంగా చొరబడ్డారంటూ ఏపీ పోలీసులపై డ్యామ్ వద్ద సెక్యురిటీగా ఉన్న తెలంగాణ సిబ్బంది సాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అలాగే అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారంటూ ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు మరో ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపైనా నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సాగర్ డ్యామ్ పై తమ విధులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని గుంటూరు జిల్లా విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు పిర్యాదు చేశారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల పిర్యాదు  మేరకు తెలంగాణ పోలీసులపై విజయపురి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. కృష్ణా జలాల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య మరో సారి వివాదం నెలకొనడం, ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇండెంట్ పెట్టకుండా అనుమతి తీసుకోకుండా ఏ పీ అధికారులు డ్యామ్ వద్దకు వెళ్లి నీరు విడుదల చేయడాన్ని కృష్ణా బోర్డు (కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు) తప్పుబడుతోంది. ప్రస్తుతం తెలంగాణ ఆధీనంలో ప్రాజెక్టుపైకి అనుమతి లేకుండా రావడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క ఏపీ పోలీసులు, మరో పక్క తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున సాగర్ డ్యామ్ వద్ద మోహరించడం, కేసులు నమోదు చేసుకోవడంపై కేంద్రం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర బలగాలు చేరుకోవడంతో తెలంగాణ పోలీసులు డ్యామ్ వద్ద నుండి వెనుతిరిగాయి.

Telangana Elections: బీఆర్ఎస్ సర్కార్ పై కీలక అంశాలతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju