ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వాహనంపై నిల్చుని అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో బాలకృష్ణ వెనక్కి పడిపోయారు. వాహనంపై అటు ఇటుగా ఉన్న నేతలు ఆయనను పట్టుకున్నారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పరిణామంతో అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా తన హిందూపురం పర్యటనలో భాగంగా బాలకృష్ణ .. సరస్వతి విద్యామందిర్ లో పిల్లలకు కంప్యూటర్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ జగన్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపి రాజ్ భవన్ లో ఎట్ హోం.. సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హజరు