తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో ఆయన మామ, సీనీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (బాలయ్య) పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గార్ల తిన్నెలో అల్లుడు లోకేష్ తో కలిసి నడక సాగించారు బాలయ్య. పాదయాత్రలో బాలకృష్ణ పాల్గొనడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ విషయంలో సీఎం జగన్ చేతులెత్తేశారని విమర్శించారు బాలకృష్ణ. కేంద్రం నుండి కనీసం నిధులు కూడా తీసుకురాలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మెగా బైట్ కు , గిగా బైట్ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ కు పాలించడం చేత కాదనీ, సలహాదారులను పెట్టుకున్నా వారి మాటలను వినడని విమర్శించారు. మీ కోసం .. మీ నాయకుడిని మీరే ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీయే కాదు, ప్రతి ఒక్కరూ విజృంభించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తపడి కళ్లు తెరవాలని బాలయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడుందని ప్రశ్నించారు. బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ వంటివి చూస్తున్నామన్నారు. పోలవరం ఏడాదిలో పూర్తి చేస్తామనీ, నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ ఊసే ఎత్తలేదన్నారు. రాష్ట్రంలో అసమర్థ, చెత్త ప్రభుత్వం నడుస్తొందని దుయ్యబట్టారు. ఓటు అనే ఆయుధం ప్రజలకు రక్షణ అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నిస్తూ సరే చేశారు. దానితో అభివృద్ది ఏమైనా జరిగిందా అంటే అంతా శూన్యం అని అన్నారు. గంజాయిలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నామన్నారు.

ఇక రేట్ల విషయానికి వస్తే విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ , ఇంటి పన్నలు, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసే పరిస్థితుల్లో మన రాష్ట్ర నడుస్తొందన్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ ఎమ్మెల్యేలు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా పేరిట ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన కేసులు వేయడం, బెదిరించడం, హత్యారాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు తమ కు ఎక్కడ అడ్డంకి అవుతారోనని వాళ్లు ఏం చేసినా అడ్డుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీకి చెంపపెట్టని అన్నారు. వైసీపీ నేతలలో కూడా అసంతృప్తి ఉందని, ఆ పార్టీలో బబుల్ బద్దలవుతుందని చెప్పారు. ప్రజా సేవ చేయాలని కొంత మంది వైసీపీ నేతలకు ఉన్నప్పటికీ ఆయన చేయనివ్వరు గా అంటూ జగన్ ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఇదే విధంగా ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా పరిపాలన సాగితే మరో శ్రీలంక అవుతుందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ మళ్లీ వచ్చే శుభసూచకాలు చాలా కనిపిస్తున్నాయని అన్నారు. ఇంతకు ముందు జనాలు బయటకు రావాలంటే భయపడేవారని ఇప్పుడు మహిళలు, యువత అందరూ బయటకు వస్తున్నారన్నారు.
వరంగల్లు పోలీసుల నోటీసులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రియాక్షన్ ఇది