NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హెల్త్ యూనివర్శిటికీ ఎన్టీఆర్ పేరు తొలగించడంపై నందమూరి లక్ష్మీపార్వతి స్పందన ఇది

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ని ఏపి సర్కార్ రీసెంట్ గా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చిన సంగతి తెలిసిందే. హెల్త్ యూనివర్శిటికీ ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు తప్పుబడుతున్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పదవి నుండి తొలగించిన వారికి మాట్లాడే అర్హత లేదని పేర్కొంటున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం వైసీపీ లో నేతగా ఉన్న దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి స్పందించకపోవడంపై పలు ఛానల్స్ లో, సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై లక్ష్మీపార్వతి నేడు ఘాటుగా స్పందించారు.

Nandamuri Lakshmi Parvati

 

తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కేసులు పెడతామనిలక్ష్మీపార్వతి హెచ్చరించారు. ఏబీఎన్ తప్పుడు కథనాలు ఇస్తుందంటూ మండిపడ్డారు. ఏబీఎన్ ఇస్తున్న కథనాలపై వివరణ ఇచ్చేందుకే మీడిాయా ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఎన్టీఆర్ తో తనకు ఎలా వివాహం జరిగింది అనే విషయాలను వివరించారు.తనను వివాహం చేసుకున్న విషయంపై స్వయంగా ఎన్టీఆర్ చివరి మీడియా సమావేశంలో మాట్లాడారని గుర్తు చేస్తూ అప్పటి వీడియోను ప్లే చేసి చూపించారు. తనపై చెత్త పలుకులు రాస్తే కేసు అవుతుందని హెచ్చరించారు. ఎన్టీఆర్ అధికారంలో ఉండగా గానీ,. అధికారంలో లేనప్పుడు గానీ తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదన్నారు. తాను ఎలాంటి స్వార్ధం కోసం ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదనీ, తాను ఏ రోజు పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.

రాష్ట్రంలో వైద్య కళాశాలలు తీసుకురావడంతో పాటు పేద వాళ్లకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం, తాజాగా మరో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో స్వతహాగా వైద్యుడైన దివంగత సీఎం వైఎస్ఆర్ పేరు హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇది సముచిత నిర్ణయంగా ప్రభుత్వం భావించిందన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ పేరును దేనికి పెడదామన్న దానిపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్టిఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాళ్లకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వారే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju