NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

NTR Satajayanthi Celebrations: నందమూరి లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

NTR Satajayanthi Celebrations: నేడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. మరో పక్క రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు లో చంద్రబాబు తదితర టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాన్ని ఆయన అభిమానులు నిర్వహించారు. మరో పక్క విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో నందమూరి లక్ష్మీపార్వతి, సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, అధికార భాషా సంగం అధ్యక్షుడు విజయబాబు, దేవినేని అవినాష్, నగర మేయర్ భాగ్యలక్ష్మి, ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Nandamuri Lakshmi parvati sensational comments

 

ఈ సందర్భంగా నందమూరి లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాననీ, తన ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్టీఆర్‌ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు అని అన్నారు. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమేననీ. దేవినేని నెహ్రూ ఎన్టీఆర్‌కు అసలైన వారసుడని అన్నారు లక్ష్మీపార్వతి. మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఈ  దుర్మార్గులు ఎలా వారసులు అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడనీ, చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్‌ ఎంతో బాధపడ్డారన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడనీ, ఎన్టీఆర్‌ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాటనని పేర్కొన్నారు. క్లిష్టసమయంలో డైరెక్టర్‌ రాం గోపాల్‌వర్మ నాకు ధైర్యాన్ని ఇచ్చారనీ, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారన్నారు. నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారని అన్నారు. పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీపార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పోసాని వివరించారు. వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మశాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలనీ, చంద్రబాబు లాంటి గుణం లేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.

New Parliament Building Inauguration: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!