NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ .. ఎందుకు అంటే..?

Share

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాదయాత్రకు విరామం ప్రకటించి కాటేవారిపల్లి బస కేంద్రం నుండి నేడు లోకేష్ వెల్లిపోయారు. ఈ నెల 14వ తేదీ నుండి మళ్లీ లోకేష్ పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కాటేవారిపల్లి నుండి పాదయాత్ర కొనసాగనున్నది. నియోజకవర్గ ఓటర్లు మాత్రమే ఇక్కడ ఉండాలని, స్థానికేతరులు ఇక్కడ ఉండకూడదంటూ టీడీపీ నేతలకు మదనపల్లె ఆర్డీఓ నోటీసులు ఇచ్చారు.

Nara Lokesh Padayatra

ఇవేళ మధ్యహ్నం స్థానిక తహశీల్దార్ కూడా పాదయాత్ర శిబిరిం వద్దకు వచ్చి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో 48 గంటల ముందే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా లోకేష్ పాదయాత్రకు 12,13 తేదీల్లో విరామం ప్రకటించారు. ఇవేళ పాదయాత్రలో లోకేష్ ను ఆయన సతీమణి నారా బ్రహ్మణి కలిశారు. పాదయాత్రకు విరామం ఇవ్వడం ఇద్దరు కలిసి బెంగళూరు విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత లోకేష్ ఈ నెల 14వ తేదీ కాటేవారిపల్లికి చేరుకుని అక్కడి నుండే పాదయాత్రను పునః ప్రారంభిస్తారని టీడీపీ నేతలు వెల్లడించారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్రను జనవరి 27వ తేదీన ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో నందమూరి తారక రత్న మరణించిన సమయంలో రెండు రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చారు. 41 రోజులుగా సాగుతున్న పాదయాత్రలో ఇప్పుడు రెండు సారి తాత్కాలిక విరామం ఇచ్చారు. మొత్తం 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర యాత్ర చేయాలని లోకేష్ లక్ష్యంగా నిర్ణయించుకోగా, అందులో ఇప్పటి వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 520 కిలో మీటర్లు పూర్తి చేశారు.


Share

Related posts

మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి – సిఎస్

somaraju sharma

KCR: హుజురాబాద్ లో అభ్య‌ర్థితో కేసీఆర్ ఏం చెప్ప‌ద‌ల్చుకున్నారంటే…

sridhar

Crime News: వయసు పైబడుతున్నా ఆ యువతి వివాహానికి ఒప్పుకోవడం లేదని కోపంతో తండ్రి చేసిన పనికి ఊరంతా షాక్ అయ్యింది..

somaraju sharma