Nara Lokesh: ఏపి సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ ప్రశ్నాస్త్రాలతో లేఖ

Share

Nara Lokesh: ఏపిలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. అధికార వైసీపీ, టీడీపీ మద్య విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం నడుస్తోంది. ఓ పక్క బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తూ అధికార వైసీపీ ప్రభుత్వం విమర్శల దాడి చేస్తోంది. మరో పక్క గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా వివిధ సంక్షేమ పథకాల కార్యక్రమాల సందర్భంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ ను, దుష్టచతుష్టయం అంటూ వారి అనుకూల మీడియాపై విమర్శలు చేస్తున్నారు. అయిదేళ్ల చంద్రబాబు హయాంలో వివిధ పథకాలకు ఎంత ఖర్చు పెట్టారు. ఈ మూడేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎంత వెచ్చించారో జగన్ తెలియజేస్తూ తేడా గమనించాలని ప్రజలకు కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖాస్త్రాన్ని సంధించారు. 17 ప్రశ్నలతో కూడిన లేఖను జగన్ కు విడుదల చేశారు లోకేష్.

Nara Lokesh letter to cm ys jagan

Nara Lokesh: ఇవీ ప్రశ్నలు

1. అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు..
2. మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వాారా.. ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్టు కట్టారా..
3. రైతుల నుండి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారు.. ఈ ఏడాది ధాన్యం కొన్నారా..
4. రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది..
5. ఇన్ పుట్ సబ్సిడీ ఎక్కడ..
6. తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఎంత ఇచ్చారు..
7. పంటల భీమా ప్రీమియం కట్టామన్నారు..రైతులకి ఇన్సూరెన్స్ వర్తించలేదెందుకు..
8. రూ.12,500 రైతు భరోసా ఇస్తానని, రూ.7,500 ఇస్తుంది ఎవరు..
9. రాష్ట్ర వ్యాప్తంగా వున్న కౌలు రైతులని అసలు గుర్తించారా..
10. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయి..
11. కేంద్రం తెచ్చిన వ్యవసాయ రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖులు ఎవరు..
12. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడే మళ్లీ తీసుకువచ్చిన అసమర్ధుడు ఎవరు..
13. టీడీపీ హయాంలో రైతులకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ నిబంధనని కేవలం రూ.1లక్షకే పరిమితం చేసింది ఎవరు..
14. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో వుండటానికి కారకుడివి నీవు కాదా..
15. ముదిగొండ లో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న గారి చరిత్ర మర్చిపోయారా..
16. సోంపేటలో తమ భూముల్ని లాక్కొవద్దని ఆందోళన చేసిన రైతులు ఆరుగుర్ని కాల్చి చంపించింది. . మీ నాయన రాజశేఖరరెడ్డి కాదా..
17 .రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకి సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడు ఆదేశాలతో.. అంటూ నారా లోకేష్ ప్రశ్నాస్త్రాలను సంధించారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

16 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

39 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago