NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నారా లోకేష్ పాదయాత్రకు మూహుర్తం, పేరు ఫిక్స్.. పాదయాత్ర జెండా ఆవిష్కరించిన అచ్చెన్న

ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఒ పక్క గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు జనాల్లో తిరుగుతుండగా, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు జిల్లాల్లో రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది నాలుగు నెలల సమయం ఉండగానే అన్ని రాజకీయ పక్షాలు జనాల్లో ఉండేందుకు కార్యచరణ సిద్దం చేసుకుంటున్నాయి. జనాలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరో సారి అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతలు జనాల్లోకి తిరుగుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అవకాశం ఇవ్వాలంటూ ఆ పార్టీ ప్రజల్లో తిరుగుతోంది.

Nara Lokesh

 

ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర, జనసేన జనవాణి పేర్లతో పర్యటిస్తున్నారు. త్వరలో బస్సు యాత్రకు పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా వారాహి పేరుతో వాహనాన్ని సిద్దం చేసుకున్నారు. మరో పక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుండి పాదయాత్ర నిర్వహించేందుకు కార్యచరణ ప్రకటించారు. లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు పేరు, మూహూర్తం ఖరారు అయ్యింది. 2023 జనవరి 27వ తేదీ లోకేష్ చేపట్టే పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు. ఈ మేరకు టీడీపీ ఓ ప్రకటన చేసింది. అంతే కాకుండా యువగళం పేరుతో ప్రత్యేక జెండాను రూపొందించారు.

Nara Lokesh Padayatra Yuvagalam Flag Hoisted by TDP Leader Atchannaidu

 

యువగళం ప్రత్యేక జెండా ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు నిమ్మకాయల చిన రాజప్ప, నక్కా ఆనందబాబు, షరీఫ్, వంగలపూడి అనిత తదితర నేతలు ఆవిష్కరించారు. కుప్పం నుండి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర విజయవంతం కోసం పార్టీ ఏర్పాట్లు చేస్తొంది. మొత్తం 400 రోజులు 4వేల కిలో మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా నడక సాగించనున్నారు. కుప్పం నుండి ప్రారంభమయ్యే లోకేష్ పాదయాత్ర ఇచ్చాపురం వరకూ సాగనుంది. తొలుత నారా లోకేష్ బస్సు యాత్ర చేపట్టాలని భావించినప్పటికీ ప్రజల్లో మమేకం అయ్యేందుకు పాదయాత్రే మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?

Nara Lokesh Padayatra Yuvagalam Flag Hoisted by TDP Leader Atchannaidu

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju