NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లోకేష్ లేఖ ..! ఎందుకంటే..?

Nara Lokesh: రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలోనే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించడమే మేలని తెలియజేసింది. జూన్ మొదటి వారంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.

Nara Lokesh wrote letter to amith shah
Nara Lokesh wrote letter to amith shah

ఈ నేపథ్యంలో నారా లోకేష్ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దేశంలో 14 రాష్ట్రాల్లో పరక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారనీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి  బోర్డులు కూడా పరీక్షలు చేశాయన్న విషయాన్ని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ తో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే పట్టుదలతో ఉందని తెలిపారు. వేలాది పరీక్షా కేంద్రాల్ల 6.7లక్షల మంది పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మరో పక్క 5 లక్షల మంది  ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తమ పరీక్షలపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారన్నారు.

Read More: Vijayasai reddy: చంద్రబాబును గుంటనక్కగా పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అవలంబిస్తున్న విధానాన్నే ఏపి ప్రభుత్వం కూడా పాటించేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను లోకేష్ కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని లోకేష్ కోరారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju