Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం కుప్పంలో పాదయాత్రను మొదలు పెట్టారు నారా లోకేష్. తొలుత కుప్పం లక్ష్మీపురం లో శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత హెబ్రూన్ అఫ్ వర్షిప్ చర్చిలో, మసీదులో ప్రార్ధనలు నిర్వహించారు. కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర నాలుగు వేల కిలో మీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది.

లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్య టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ పాదయాత్ర ప్రారంబోత్సవంలో పాల్గొనేందుకు కుప్పం వచ్చిన నందమూరి బాలకృష్ణ ట్రిఫిక్ జామ్ లో చిక్కుకోవడంతో ద్విచక్ర వాహనంపై ఆలయం వద్దకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడ, సీనియర్ నేతలు కుప్పం చేరుకుని లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రజలకు అభివాదనం చేస్తూ నేతలు, కార్యకర్తలతో కలిసి నడకసాగిస్తున్నారు నారా లోకేష్, మధ్యాహ్నం 3 గంటలకు కుప్పంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
కాగా లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ పాదయాత్రకు ఆల్ ది బెస్ట్ చెప్పారు చంద్రబాబు. యువత భవిత కోసం.. ప్రజల బతుకు కోసం.. రాష్ట్ర భవిష్యత్తు కోసం.. లోకేష్ పాదయాత్ర అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నారా లోకేష్ మొదటి రోజు 8.5 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
లోకేష్ పాదయాత్రపై అంబటి సెటైర్
కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైన వెంటనే మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. “ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు ! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు !” అంటూ లోకేష్ పాదయాత్రపై అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు.
బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం .. అభిమానులకు అభివాదం చేస్తూ..వీడియో వైరల్