NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు

Share

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆ పార్టీలోని కొందరు నాయకులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో బిజీగా ఉన్నారు. తన సినీ కేరీర్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్ కు లేదు. ఆ విషయాన్ని ఆయనే గతంలో ఓ పర్యాయం చెప్పారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నట్లుగా చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంకు వస్తే పార్టీ క్యాడర్ లో జోష్ వస్తుందని పార్టీలోని యువత కోరుకుంటోంది. కొందరు సీనియర్ లు భావిస్తున్నారు. అయితే పార్టీ అధినేత మనసులో ఏముందో తెలియక ఎవరూ మాట్లాడటం లేదు.

Nara Rohit key Comments on Jr NTR political entry

 

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై  సినీ హీరో నారా రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో 50వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. మూడు రోజుల విరామం తర్వాత శనివారం పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. తొలుత విడిది కేంద్రంలో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నారా రోహిత్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్ డిఫెన్స్ పడిందని, అందుకే టీడీపీ పై బురదజల్లుతున్నారని రోహిత్ విమర్శించారు. యువగళం పాదయాత్ర మునుముందు ప్రభంజనం రేపుతుందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని రోహిత్ వ్యాఖ్యానించారు.

‘అరెస్టు చేసినా తగ్గేదిలే..ప్రశ్నిస్తునే ఉంటా’


Share

Related posts

Janasena: సంక్రాంతి తరువాత అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్..?

somaraju sharma

Bigg Boss Telugu 5 : వాళ్ళిద్దరికీ నా సపోర్ట్ అంటున్న సీజన్ ఫోర్ రన్నర్ అఖిల్..!!

sekhar

బిగ్ బాస్ షోని ఆ పరంగా అయితే అంచనా వేయలేం అంటున్న రాహుల్ సిప్లిగంజ్..!!

sekhar