Narayana Case: రాజకీయ పార్టీలకు కొంత మంది నేతలు ఆర్థిక శక్తిగా ఉంటారు. ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు గెలవాలి అంటే పోల్ మేనేజ్‌మెంట్ మెంట్ చేయాలి. ఇది అందరికి తెలిసిన సత్యం. గతంలో టీడీపీకి నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, బీద మస్తాన్ రావు లాంటి కొందరు నాయకులు ఉన్నారు. అయితే ప్రస్తుతం పై నలుగురిలో నారాయణ తప్ప మిగిలిన వారు ఆ పార్టీ లో లేరు. బీద మస్తాన్ రావు వైసీపీలో, మిగిలిన ఇద్దరు సుజన చౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో ఉన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా టీడీపీ ఆర్ధిక శక్తులను వైసీపీ కట్టడి చేస్తోంది. ఆ ఉంటే 50 శాతం పైగా సక్సెస్ అయింది. కొందరు మాత్రం ఇబ్బందులు ఎదురు అయినా టీడీపీతోనే ఉన్నారు. త్వరలో జరగబోయే టీడీపీకి గట్టిగా సపోర్ట్ చేసి నెల్లూరు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం కోసం పని చేస్తున్నారు నారాయణ ఫిక్స్ అయ్యాడు.
అందుకే తన విద్యా సంస్థలను బాధ్యతగా కుటుంబ సభ్యులకు అప్పగించి పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేసింది అన్న టాక్ వైసీపీ నడుస్తోంది. అందులో భాగంగా రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అసలు భూసేకరణే జరగలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది లేదు కానీ దానిలో పెద్ద కుంభకోణం, అవినీతి జరిగినట్లుగా చంద్రబాబు, నారాయణతో మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దానితో పాటు టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలోనూ నారాయణపై కేసు నమోదు చేశారు. నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ కేసుపై నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు తీర్పులు తరువాత ఎలా ఉన్నా కేసుల మూలంగా ప్రస్తుతం ఆయనకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా నారాయణ పార్టీని వదిలి బయటకు రావాల్సిన అవసరం లేదు. పార్టీకి వెన్నుదన్నుగా ఉండకుండా సైలెంట్ గా ఉంటే చాలు. ఆయనను మానసికంగా దెబ్బతీస్తే వైసీపీ సక్సెస్ అయినట్లే. ప్రస్తుతం జరుగుతున్న చర్యలు ఒక రకంగా ఆయనకు ఒక సంకేతం లాంటివి. నారాయణకు అన్నీ తెలుసు. గత మూడు ఎన్నికల పార్టీకి వెన్నుదన్నుగానే ఉంటున్నారు. అయితే కేసులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. చూడాలి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో?.
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…
Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…
Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్…
RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) తండ్రికి తగ్గ తనయుడు అన్న తరహాలో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.…