Nayanthara: తెలియక చేసిన తప్పుకు క్షమించాలంటూ లేఖ విడుదల చేసిన విఘ్నేశ్ శివన్

Share

Nayanthara: నూతన జంట నయనతార, విఘ్నశ్ శివన్ .. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, ఆలయ ఆవరణలో ఫోటో షూట్ చేసుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో ఈ జంటపై చర్యలకు తీసుకునేందుకు టీటీడీ సిద్దం అయ్యింది. అయితే ఈ వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్ శివన్ లేఖ విడుదల చేశారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉన్నాయనీ, ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తు లేదనీ, తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు విఘ్నశ్ శివన్.

Nayanthara tirumala Issue Vignesh Apologies letter

 

తాము తిరుమలలోనే వివాహం చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకున్నామనీ, ఈ క్రమంలోనే ఈ కొండకు గడచిన 30 రోజుల్లో అయిదు సాార్లు వచ్చామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో వివాహం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే వివాహం అయిన వెంటనే మండపం నుండి నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని కళ్యాణం వీక్షించి ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నామనీ, అదే క్రమంలో శుక్రవారం స్వామివారి దర్శనం చేసుకున్నామన్నారు. దర్శనం అనంతరం తమ వివాహం ఇక్కడే జరిగిందనే భావన కలగడం కోసం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలో ఫోటో షూట్ చేసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు.

 

అయితే ఆ సమయంలో ఆలయ ఆవరణలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వెళ్లిపోయామనీ, మళ్లీ తిరిగి అక్కడికి వచ్చామనీ, ఫోటో షూట్ వెంటనే పూర్తి చేయాలన్న తొందర పాటు పరిస్థితుల్లో తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్నే మర్చిపోయామన్నారు. తాము ఎంతగానో ఆరాధించే స్వామివారిని అవమానించడానికి ఇలా చేయలేదనీ, దయచేసి క్షమించాలని లేఖలో పేర్కొన్నారు శివన్. శివన్ క్షమాపణలు చెబుతూ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో టీటీడీ అధికారులు తమ చర్యలను కొనసాగిస్తారా.. లేక ఇంతటితో ఈ వివాదానికి స్వస్తి పలుకుతారా అనేది వేచి చూడాలి.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 min ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

25 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

3 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago